close
Choose your channels

ఇప్పుడు వ‌ర్మ మొద‌లెట్టాడుగా!

Saturday, January 12, 2019 • తెలుగు Comments

ఇప్పుడు వ‌ర్మ మొద‌లెట్టాడుగా!

మొన్న‌టి వ‌ర‌కు య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌లో తొలి భాగం `య‌న్.టి.ఆర్ క‌థానాయ‌కుడు`కి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌, ఫ‌స్ట్ లుక్స్‌, టీజ‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కులు నిండా మునిగిపోయారు. ఇప్పుడు వ‌ర్మ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ మొద‌ల‌య్యాయి. అందులో భాగంగా వ‌ర్మ ఈ సినిమాలో ల‌క్ష్మీ పార్వ‌తిగా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఓ క్లారిటీ ఇచ్చారు. ల‌క్ష్మీపార్వ‌తికి సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు.

`కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌`లో వీర‌ప్ప‌న్ భార్య ముత్తుల‌క్ష్మిగా న‌టంచిన య‌జ్ఞా శెట్టి ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారట‌. అలాగే నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ధారి లుక్‌ను కూడా వ‌ర్మ విడుద‌ల చేశారు. `వంగ‌వీటి` చిత్రంలో న‌టించిన శ్రీతేజ్ చంద్ర‌బాబు నాయుడుగా న‌టిస్తున్నాడు. దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలో ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఈ సినిమాలో చూపిస్తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించ‌డంతో ఈ సినిమాపై విమ‌ర్శ‌లు, వివాదాలతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

Get Breaking News Alerts From IndiaGlitz