ఈ బాస్టడ్‌ను ఏం చేస్తారో చెప్పండి! : ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ వ్యక్తి జింకలను కాల్చుతూ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి లింక్ పెడుతూ ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ పూర్తి సారాంశమేంటి..? ఆ ట్వీట్‌పై నెటిజన్లు ఏమంటున్నారు..? ఆర్జీవీ రిప్లై ఎలా ఇచ్చారు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సల్మాన్ సంగతేంటి!?

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. విచారణ నిమిత్తం జోధ్‌పూర్‌ కోర్టుకు వెళ్తూ వస్తున్నారు. కాగా.. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ కోసం జోధ్‌పూర్ వెళ్లిన సల్మాన్.. అక్కడ సహ నటులు సైఫ్ అలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ తదితరులతో కలిసి అడవుల్లోకి వెళ్లి రెండు కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలున్నాయి. కాగా.. ఈ కేసును విచారించిన కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సల్మాన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.

ఇంతకీ ఆయనెవరో!?

ఆర్జీవీ పోస్ట్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి జింకలను కాల్చుతూ షూటింగ్ ప్రాక్టింగ్ చేస్తున్నట్లున్నాడు. అంతేకాదు.. షూటింగ్‌లో గాయపడిన జింకను కత్తితో కోస్తున్నట్లు కూడా వీడియోలో ఉండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తి ఎవరో..? ఈ ఘటన ఎక్కడ జరిగింది..? ఇంతకీ మనదేశంలోనేనా.. మరో దేశంలో ఎక్కడైనా జరిగిందా..? అనే విషయం మాత్రం తెలియరాలేదు. కొందరైతే ఓ కేంద్రమంత్రి అంటూ పేరును ప్రస్తావిస్తుండగా.. మరికొందరు మాత్రం అబ్బే అది మనదేశంలో జరగలేదు.. బంగ్లాదేశ్‌లో అని చెబుతున్నారు.

ఆర్జీవీ డిమాండ్ ఇదీ..!

జింకల వేట కేసులో.. సల్మాన్ ఖాన్‌ను పోలీసులు, కోర్టులు వెంటాడుతున్నాయ్ సరే.. మరి ఇదిగో ఈ వీడియోలో చూస్తున్న బాస్టడ్‌‌‌ను ఎందుకు పట్టుకోవట్లేదు..? ఏం చేస్తున్నారురు..? ఆయన యార్డ్ ముందు ఇలా షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడే.. మరి పోలీసులు, కోర్టులు ఏం చేస్తున్నాయ్..? పోలీసులు, కోర్టులు ఏం చేస్తాయో చెప్పండి..? అని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ డిమాండ్ చేస్తున్నారు.

More News

బీజేపీ చేరిన సైనా.. సక్సెస్ అయ్యేనా!?

భారత స్టార్ బ్యాండ్మింటన్ ప్లేయర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విమానంలో కమెడియన్‌ వెకిలి చేష్టలు.. షాకిచ్చిన ఇండిగో!

బస్సు, ట్రైన్ లేదా విమాన ప్రయాణం ఇలా ఏదైనా సరే తోటి ప్రయాణికులతో మంచిగా ఉండకపోయినా పర్లేదు కానీ..

ప్రారంభమైన ప‌వ‌న్ కళ్యాణ్ మరో కొత్త చిత్రం

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీసెంట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ చిత్రం `పింక్‌` సినిమా తెలుగు రీమేక్‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు.

మోదీ తర్వాత రజనీకాంతే

ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంతే... అవునా ఏ విషయంలో అనే సందేహం కలుగుతోంది కదూ..

'క్రాక్' కాపీ క‌థ‌నా?

ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `క్రాక్‌`. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.