రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌కి తన స్టైల్లో రిప్లై ఇచ్చిన వర్మ

సంచలన దర్శకుడికి దాదాపు ఎవరూ సలహా ఇచ్చే సాహసం కానీ లేదంటే ఛాలెంజ్‌లు విసిరే సాహసం కానీ చేయలేరు. ఎందుకంటే ఆయన నుంచి ఎలాంటి రిప్లై వస్తుందోనన్న భయంతో కామ్‌గా ఉండిపోతారు. కానీ దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఓ ఛాలెంజ్ విసిరారు. తన వరకూ బహుశా వర్మ మంచిగానే స్పందిస్తారని ఆయన ఊహించి ఉండవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తన స్టైల్లో రిప్లై ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన ఆయన తన టీంతో కలిసి మొక్కలు నాటారు. ః

అంత వరకూ బాగానే ఉన్నప్పటికీ.. రాజమౌళి ఈ కార్యక్రమానికి దర్శకులు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, వివి వినాయక్‌ను నామినేట్ చేశారు. మిగిలిన ఇద్దరి సంగతేమో కానీ.. రామ్ గోపాల్ వర్మ మాత్రం స్పందించారు. తను ఏ ఛాలెంజ్‌ను స్వీకరించలేనని వెల్లడించారు. తనకు మట్టి ముట్టడమంటే అసహ్యమని తెలిపారు. ‘‘రాజమౌళి సర్.. నేను ఏ గ్రీన్‌ని కానీ.. ఛాలెంజ్‌ను కానీ స్వీకరించలేను. అందునా నాకు మట్టి ముట్టడమంటే అసహ్యం. మొక్కలు నాటే అర్హత మంచి వ్యక్తులకు మాత్రమే ఉంది. నాలా సెల్ఫిష్‌గా ఉండే వ్యక్తులు నాటకూడదు. మీకు, మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్’’ అని వర్మ ట్వీట్ చేశారు.

More News

ఇక నుంచి ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా.. అశ్లీలత కట్టడికి చర్యలు..

ఓవర్‌ ది టాప్(ఓటిటి)లో పెరిగిపోతున్న అశ్లీలత కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా ఉండనుంది.

ఎస్వీబీసీలో పోర్న్‌సైట్ కలకలం.. 25 మందిని గుర్తించిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు మారు పేరు. కొండపైకి మద్యం, మాంసాహారం వంటివన్నీ నిషేధం.

‘ఆర్ఆర్ఆర్’.. ఆలియా రాకకు తప్పని నిరీక్షణ!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

విజయసాయికి వైసీపీ ఎమ్మెల్యే ఝలక్..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. విశాఖకు అప్రకటిత కింగ్.. వైసీపీలో రెండో స్థానం.. అధికారులకు ఎంత చెబితే అంత..

ఒక్క దుబ్బాక ఉపఎన్నిక.. తలెత్తుతున్న ప్రశ్నలెన్నో..

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఏం చెప్పింది? ప్రజలు మార్పు కోరుకోవాలనుకుంటున్నారా? కేసీఆర్ పాలనపై వ్యతిరేకత నివురు గప్పిన నిప్పులా ఉందా?