‘మర్డర్’పై నమోదైన కేసుపై స్పందించిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ‘మర్డర్’పై మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు నమోదైంది. వర్మ మిరియాలగూడకు చెందిన ప్రణయ్ హత్యపై సినిమాను తెరకెక్కించనున్నవిషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తన కుమారుడి హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ప్రణయ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం కానీ.. ఎవరినీ దిగజార్చే ఉద్దేశం కానీ లేదని ముందే చెప్పానని పేర్కొన్నారు. ఓ సున్నితమైన అంశంతో తాను సినిమాను తీయనున్నానని వెల్లడించారు.

అయితే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను కూడా చట్ట ప్రకారంగా మాత్రమే ముందుకు వెళతానన్నారు. ఊహాగానాల ఆధారంగా మాత్రమే తనపై కేసు నమోదైందని.. దానికి తన న్యాయవాదులు సమాధానం ఇస్తారన్నారు. తన చిత్రంపై ‘మర్డర్’పై దాఖలైన కేసు మీడియా ఊహాగానాలకు సంబంధించిందని.. కానీ తాను నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని.. స్టోరీ మాత్రం కల్పితమని వర్మ వెల్లడించారు. అలాగే ఈ చిత్రంలో ఎవరి కులం గురించి తాను ప్రస్తావించలేదన్నారు.

More News

అలా ఐదు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నా: హోం మంత్రి అలీ

కరోనా నుంచి ఐదు రోజుల్లోనే కోలుకుని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాను ఏ విధంగా కోలుకున్నది..

తెలంగాణ కరోనా బులిటెన్.. కొనసాగుతున్న విజృంభణ

తెలంగాణ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. శనివారం కూడా కరోనా విజృంభణ తెలంగాణలో కొనసాగింది.

అన్న‌య్యే కాదు.. అంత కంటే ఎక్కువ: తార‌క్‌

‘‘నాకు అన్నయ్యగానే కాదు అంత కంటే ఎక్కువ‌. నా స్నేహితుడు, త‌త్వ‌వేత్త‌, మార్గ‌ద‌ర్శ‌కుడు. నువ్వు నిజంగా బెస్ట్‌.. హ్య‌పీ బ‌ర్త్ డే క‌ల్యాణ్ అన్న’’ అని అంటున్నారు

నారప్పలో మునిక‌‌న్నా పాత్ర‌లో  కార్తిక్..

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా,

'వంగవీటి రంగా' గా సురేష్ కొండేటి

దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో సురేష్‌ కొండేటి  నటిస్తున్న ‘దేవినేని’