నాకంత టైమ్ లేదు.. ‘పరాన్నజీవి’పై వర్మ..

తనపై బిగ్‌బాస్ ఫేం.. నూతన్ నాయుడు తెరకెక్కిస్తున్న ‘పరాన్నజీవి’ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఒకరి ఒపీనియన్ మరొకరు చెబుతున్నారని.. ఎవరి సినిమా అయినా ఇంతేనని పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు. వాళ్లు తమ ఒపీనియన్ చెబుతున్నారు. వాళ్ల ఇన్‌టెన్షన్.. మోటివ్స్ నాకు అవసరం లేదు. నాకంత టైమ్ లేదు. అంత టైమ్ వేస్ట్ చేసుకోను. వాళ్లకు నాపై కోపమా.. మరొకటా.. అనే దానిపై నాకసలు ఇంట్రస్టే లేదు. దానిపైన టైమ్ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ సినిమాకు సంబంధించి కొన్ని విన్నాను. యూట్యూబ్‌లో నా గురించి ఎంతో ఫన్ చేస్తుంటారు. దాంట్లో ఇదొకటి. ఫైనల్‌గా ఒకరి ఒపీనియన్‌ని ఇంకొకరు చెబుతున్నారు.. వినేవాళ్లు వింటారు.. వినని వాళ్లు వినరు. అది నా సినిమా అయినా.. ఎవరి సినిమా అయినా అంతే’’ అని వర్మ పేర్కొన్నారు.

‘పవర్ స్టార్’ సినిమా విషయమై పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారన్న దానిపై వర్మ మాట్లాడుతూ... ‘‘ఎవ్వరికీ ఆందోళన ఉండదని.. ఎవరికీ అంత టైమ్ లేదు. ఆ ఎమోషనల్స్ అన్నీ ఫేక్... సినిమా ఏంటి అనేది చూడకుండా.. ముందే ఊహించుకుని.. దానిపై చొక్కాలు చింపేసుకుని గుర్రమనడమనేది స్టుపిడిటి. నేను పవన్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఆయనను అభిమానిస్తాను’’ అని వర్మ తెలిపారు.

More News

11 ఏళ్ల త‌ర్వాత అనుష్క సినిమా రీమేక్‌...!!

స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్‌ను స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతుంది. సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క దాదాపు అంద‌రు సూప‌ర్‌స్టార్స్‌తో న‌టించింది.

అది చిరంజీవి గారి డ్యూటీ కాదు..: ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యూస్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఆయన ఆలోచనా విధానం ఉంటుంది.

'Bకామ్ లో ఫిజిక్స్ ' ఫస్ట్ లుక్ విడుదల

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు.

ఈ కాపీ పేస్ట్‌లేంటి? మరోసారి ఈటలపై మండిపడ్డ నెటిజన్స్..

వైద్య ఆరోగ్యశాఖ  బుధవారం విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో పెద్ద తప్పిదమే జరిగింది.

తెలంగాణలో తాజాగా 1554 మందికి కరోనా పాజిటివ్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం తెలంగాణ కరోనా బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.