బైడెన్, ఫౌచీ వస్తున్నారు.. ఆనందయ్యపై ఆర్జీవీ సెటైర్లు

  • IndiaGlitz, [Saturday,May 22 2021]

నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంలో కరోనా రోగులకు ఆనందయ్య అనే నాటు వైద్యుడు చేస్తున్న వైద్యం దేశం మొత్తం సంచలనంగా మారింది. ఆనందయ్య ఇచ్చిన మందు వాడక తాము కరోనా నుంచి త్వరగా కోలుకున్నామని చాలా మంది పాజిటివ్ గా చెబుతుండడంతో డిమాండ్ పెరిగింది.

ఆనందయ్య ఇస్తున్న మందుపై అధ్యయనం చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఐసిఎంఆర్ రంగంలోకి దిగాయి. యావత్ ప్రపంచానికే పెను సవాల్ గా మారిన కరోనాని ఆనందయ్య ఇలా చిటికెలో తగ్గించేస్తున్నాడని వార్తలు రావడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి:  నీ కన్నా ఏజ్ ఎక్కువున్న నటితో డేటింగ్ ?.. హీరో ఆన్సర్ విన్నారా!

ఇదిలా ఉండగా ఎక్కడ ఏం జరిగినా నేనున్నాను అంటూ ట్విట్టర్ లో సెటైర్స్ తో ప్రత్యక్షమైపోతాడు వివాదాల రాంగోపాల్ వర్మ. తాజాగా వర్మ ఆనందయ్య పై సెటైర్లతో పలు ట్వీట్స్ చేశాడు.

'ఊపిరితిత్తులకు, కంట్లో పసరు వేయడానికి సంబంధం ఏంటి ఆనందయ్య.. జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు ప్రభుత్వం భారత్ బయోటెక్, పూనావాలా లాంటి సంస్థలకు ఫండ్స్ నిలిపివేసి ఆనందయ్య నాటు వైద్యానికి ఇస్తుందా.. జస్ట్ అస్కింగ్. అమెరికా అధ్యక్షుడు బైడెన్, అంటువ్యాధుల శాస్త్రవేత్త ఫౌచీ ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణ పట్నం బయలుదేరారని విన్నా. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికి వస్తున్నారు. ఆనందయ్యని వారు కిడ్నాప్ చేయకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి అంటూ వర్మ తనదైన శైలిలో సెటైర్లతో విరుచుకుపడ్డాడు. 

More News

మా నాన్నగారికి ఆయనే అడ్వైజర్.. బీఏ రాజు మృతి పట్ల ప్రముఖ నిర్మాత

ప్రముఖ పీఆర్వో, జర్నలిస్ట్, నిర్మాత బీఏ రాజు అకాల మరణంతో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం అర్థరాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు.

నీ కన్నా ఏజ్ ఎక్కువున్న నటితో డేటింగ్ ?.. హీరో ఆన్సర్ విన్నారా!

ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ సెలెబ్రిటీల మద్య జరుగుతున్న ప్రేమ వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో ఈ తంతు కాస్త ఎక్కువగానే ఉంటుంది.

నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

నితిన్ నటించిన ధైర్యం చిత్రం గుర్తుందిగా. 2005 లో తేజ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ నటించింది

ఇకపై ఉదయం 10 గంటల నుంచి సరిహద్దులు బంద్: డీజీపీ మహేందర్‌రెడ్డి

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లను మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర స‌రిహ‌ద్దులు మూసివేస్తామని

డీఎల్ఎఫ్ ముడుపుల కేసులో లాలూకు సీబీఐ క్లీన్‌చిట్ ?

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.