పవన్ ‘తొలిప్రేమ’ను టార్గెట్ చేస్తున్న వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అసలే తన సినిమాలకు రూపాయి ఖర్చు లేకుండా విపరీతమైన ప్రమోషన్‌ చేసుకోగల దిట్ట వర్మ. మరి చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు ప్రచారం చేసుకోకుండా ఉంటారా? స్టార్టింగ్ నుంచే అమ్మతోడు ఈ సినిమా పవన్ కల్యాణ్ బయోపిక్ కాదని చెప్పి అగ్గి రాజేశారు. నాటి నుంచి దానిని రావణ కాష్టంలా మండిస్తూనే ఉన్నారు. రోజుకో అప్‌డేట్ వదులుతూ సినిమాపై ఫుల్ హీట్ పుట్టిస్తున్నారు.

అయితే పవన్‌కి మంచి టర్నింగ్ ఇచ్చిన చిత్రం.. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీలో నిలబెట్టిన చిత్రం ‘తొలిప్రేమ’. ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 24 జులై 1998లో విడుదలైంది. ఈ చిత్ర విడుదల తేదీని టార్గెట్‌‌గా పెట్టుకుని వర్మ ‘పవర్ స్టార్’ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే వచ్చే ఏడాది జులై 24న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ తేదీన విడుదల చేస్తే ప్రచారానికి ప్రచారం.. సక్సెస్ రేటు కూడా బాగుంటుందని వర్మ స్ట్రాటజీగా తెలుస్తోంది.

More News

తెలంగాణలో శనివారం గణనీయంగా తగ్గిన కేసులు...

తెలంగాణలో శనివారం కరోనా కేసులు చాలా వరకూ తగ్గాయి. కొద్ది రోజులుగా 5వేల శాంపిల్స్‌ను పరిశీలిస్తేనే..

11 గంటలకు ‘జూమ్’ ద్వారా మీటింగ్: వరవరరావు కుటుంబం

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కుటుంబం ప్రజలను మీటింగ్‌కు ఆహ్వానిస్తోంది.

అమితాబ్‌కు కరోనా అని తేలడంతో చిరు, మహేష్, సచిన్ ట్వీట్లు

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపిన విషయం తెలిసిందే.

అభిషేక్‌, ఐశ్వర్య, జయాబచ్చన్‌ల కరోనా ఫలితమిదే...

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపింది.

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌..

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.