close
Choose your channels

త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన ఆర్జీవీ... నిర్మాత ఘాటు కౌంట‌ర్‌

Saturday, July 25, 2020 • తెలుగు Comments

త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన ఆర్జీవీ... నిర్మాత ఘాటు కౌంట‌ర్‌

శ‌నివారం వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ‘ప‌వ‌ర్‌స్టార్‌’ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్ కంటే ఆర్జీవీ, త్రివిక్ర‌మ్‌, బండ్ల గ‌ణేశ్‌ల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టిన‌ట్టు ‘ప‌వ‌ర్‌స్టార్’ చూసిన ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. ఇందులో త్రివిక్ర‌మ్‌ను పోలిన వ్య‌క్తిని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను పోలిన వ్య‌క్తి కొట్ట‌డం, అత‌ను రాసిచ్చిన స్క్రిప్ట్‌ను విమ‌ర్శించ‌డం.. డైరెక్ట్ చేసే సినిమాల‌పై వ్యంగ్యంగా మాట్లాడ‌టం చూపించారు. దీనిపై త్రివిక్ర‌మ్ నుండి ఎలాంటి బ‌దులు రాలేదు కానీ.. త్రివిక్ర‌మ్‌తో స‌న్నిహితంగా ఉండే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత‌, నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఘాటుగా స్పందించారు.

ట్విట్ట‌ర్ ద్వారా సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఆర్జీవీని టార్గెట్ చేశారు. ‘అర‌వింద స‌మేత‌’లో ‘కుక్క మొరిగితే కొండ‌కు చేటా’ అని డైలాగ్‌ను పోస్ట్ చేయ‌డంతో పాటు.. ‘‘సెన్సేషనలిజమ్ అనేది ఈరోజుల్లో సాధార‌ణంగా మారిపోయింది. త‌మ మ‌నుగ‌డ కోసం వేరే వాళ్ల జీవితాల‌ను టార్గెట్ చేసే రాబందులు ఎక్కువైపోయాయి. అలాంటి వారికి సిగ్గుండ‌దు. అలాంటి వారితో పోరాటం చేయ‌డానికి ఏకైక మార్గం వారిని ప‌ట్టించుకోకుండా ఉండ‌ట‌మే’’ అనే మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు. మ‌రి దీనిపై ఆర్జీవీ ఏమైనా రిప్లై ఇస్తారేమో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz