close
Choose your channels

ప‌వ‌న్ భ‌క్తుడి పాత్ర‌లో ఆర్జీవీ?

Monday, July 13, 2020 • తెలుగు Comments

ప‌వ‌న్ భ‌క్తుడి పాత్ర‌లో ఆర్జీవీ?

ప‌వ‌ర్‌స్టార్‌,జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భారీ అభిమాన గ‌ణం సొంతం. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఆయ‌నకు అభిమానులుంటడ‌మే ఆయ‌న క్రేజ్‌కు నిద‌ర్శ‌నం. ఇండ‌స్ట్రీ విషయానికి వ‌స్తే నిర్మాత బండ్ల‌గ‌ణేశ్ ప‌వ‌న్‌కు వీరాభిమానే కాదు. పెద్ద భ‌క్తుడు కూడా. ఇప్పుడు అలాంటి ఓ పాత్ర‌ను ఆర్జీవీ త‌న ‘ప‌వ‌ర్‌స్టార్‌’ సినిమాలో చూపించ‌బోతున్నాడు. అది కూడా ఆ వేషం ఎవ‌రు వేయ‌బోతున్నారో తెలుసా! సాక్షాత్తు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆర్జీవీ ఎక్క‌డా నేరుగా చెప్ప‌డం లేదు. కానీ.. ఆయ‌న విడుద‌ల చేసిన ‘ప‌వ‌ర్‌స్టార్’ పోస్ట‌ర్‌ను చూస్తే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను, మెగా కుటుంబాన్ని ఆయ‌న టార్గెట్ చేసిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తుంది.

ప‌వ‌న్ భ‌క్తుడి పాత్ర‌లో ఆర్జీవీ?

ఈ సినిమాలో ఇప్ప‌టికే చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను పోలిన పాత్ర‌ధారులు ఉండ‌బోతున్న‌ట్లు వ‌ర్మ పోస్ట‌ర్స్ ద్వారా చెప్పేశాడు. ఇప్పుడు సినిమాలో ఆయ‌న వీరాభిమాని, నిర్మాత అయిన బండ్ల గ‌ణేశ్ పాత్ర‌ను వ‌ర్మ పోషించ‌నున్నాడ‌ట‌. ‘అన్నా.. నువ్వు దేవుడివన్నా, వచ్చే ఎన్నికల్లో విజయం మనదే.. నీకు తిరుగులేద‌న్నా’ అనే డైలాగ్‌తో ఆర్జీవీ వెండితెర‌పై బండ్ల గ‌ణేశ్ పాత్ర‌ధారిగా సంద‌డి చేయ‌బోతున్నాడ‌ట‌. అంతే కాదండోయ్‌.. అన్నీ కుదిరితే త‌న ‘ప‌వ‌ర్‌స్టార్’ సినిమాను ప‌వ‌న్‌కు తొలి కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘తొలిప్రేమ‌’ విడుద‌లైన రోజు, జూలై 24నే విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz