‘శ‌శిక‌ళ’ బ‌యోపిక్‌పై ఆర్జీవీ అప్‌డేట్‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస సినిమాల‌ను అనౌన్స్ చేస్తూ.. వాటిని పూర్తి చేస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు. బ‌యోపిక్స్‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట అయిన ఆర్జీవీ చాలా రోజుల ముందే దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి వ‌ర్మ శ‌శిక‌ళ బ‌యోపిక్‌కు సంబంధించి అప్‌డేట్‌ను ప్ర‌క‌టించాడు. ‘‘‘శశికళ’ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఎస్ అనే మ‌హిళ‌, ఇ అనే పురుషుడు ఓ నాయ‌కురాలి జీవితంలో ఎలాంటి పాత్ర‌ను పోషించారో మా సినిమాలో చూపించ‌బోతున్నాం. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ముందు, స‌ద‌రు నాయ‌కురాలి బ‌యోపిక్ విడుద‌ల‌కు ముందే మా సినిమా విడుద‌ల‌వుతుంది. చాలా స‌న్నిహితంగా ఉన్న‌ప్పుడే చంప‌డానికి సుల‌భం అవుతుంది అని పాత త‌మిళ సామెత ఉంది’’ అన్నారు.

ఈ క్ర‌మంలో చూస్తే త‌లైవి చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లే.. అదే రోజున ఆర్జీవీ శ‌శిక‌ళ సినిమా విడుద‌ల‌వుతుంది. ఆర్జీవీ త‌న సినిమాలో పాత్ర‌లు నిజ జీవితంలోని వ్య‌క్తుల‌ను పోలి ఉంటాయి. మ‌రి ఈ చిత్రంలో శ‌శిక‌ళ పాత్ర‌ధారిగా, జ‌య‌ల‌లిత‌గాఎవ‌రెవ‌రు న‌టిస్తారు? అనేది కూడా ఆస‌క్తిని రేపుతుంది.

More News

'ప్రత్యర్థి' చిత్రం ప్రారంభం!!

రవి వర్మ , వంశీ, రోహిత్ బెహల్, అక్షిత సొనవనే ప్రధాన పాత్రధారులుగా గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాట్సాప్ ఫీచర్ వచ్చేసింది..

వాట్సాప్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

బిగ్‌బాస్ షో చూపిస్తూ క్లిష్టమైన సర్జీరీని కూల్‌గా చేసిన వైద్యులు..

అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు బిగ్‌బాస్ షో, అవతార్ మూవీ చూపిస్తూ కూల్‌గా కానిచ్చేశారు.

నాని కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్

'ఇది వరకు నా చిత్రాల్లో చూడని ప్రేమ, నవ్వులను నా 28వ చిత్రంలో చూస్తారు' అని అంటున్నారు నేచురల్‌స్టార్‌ నాని.

పాక్‌లో బయటపడిన పురాతన హిందూ దేవాలయం.. ప్రత్యేకతలివే..

పాకిస్థాన్‌లో కొన్ని వందల ఏళ్లనాటి అతి పురాతన హిందూ దేవాలయం ఒకటి తవ్వకాల్లో బయల్పడింది.