సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వర్మ వంగవీటి ట్రైలర్

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

ర‌క్త‌చ‌రిత్ర‌, ది ఎటాక్ ఆఫ్ 26/11, కిల్లింగ్ వీర‌ప్ప‌న్...ఇలా నిజ జీవిత క‌థ‌ల‌ను తెర‌కెక్కించే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం వంగ‌వీటి. బెజ‌వాడ‌ రాజ‌కీయ నాయ‌కుడు వంగ‌వీటి రంగా జీవిత క‌థ ఆధారంగా వంగ‌వీటి చిత్రాన్ని వ‌ర్మ రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఈనెల 2న వంగవీటి ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్ రెండు రోజుల లోపే 1 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం విశేషం.
గ్యాంగ్ స్ట‌ర్ మూవీస్ డైరెక్ట్ చేయ‌డంలో వ‌ర్మ మాస్ట‌ర్. ఈ ట్రైల‌ర్ ఆడియోన్స్ ని ఆక‌ట్టుకుంది అన‌డానికి ఈ ట్రైల‌ర్ కి వ‌స్తున్న రెస్పాన్సే నిద‌ర్శ‌నం. ఈ ట్రైల‌ర్ చూసిన ఆడియోన్స్ ట్రైల‌ర్ చాలా బాగుంది ఆర్.జి.వి బ్యాక్ అనేలా ఈ ట్రైల‌ర్ ఉంది అంటుండ‌డంతో మూవీ పై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. చిత్ర నిర్మాత దాస‌రి కిర‌ణ్ కుమార్ త్వ‌ర‌లోనే వంగ‌వీటి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్నారు.
ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు - చైత‌న్య ప్ర‌సాద్, రాధాకృష్ణ‌, సాహిత్యం - సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్, డిఓపి - రాహుల్ శ్రీవాస్త‌వ్, కె దిలిప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ - సిద్దార్ధ తాతోలు, సంగీతం - ర‌విశంక‌ర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - విసు, ప్రొడ్యూస‌ర్ - దాస‌రి కిర‌ణ్ కుమార్, డైరెక్ట‌ర్ - రామ్ గోపాల్ వ‌ర్మ‌.