close
Choose your channels

వ‌ర్మ ‘క్లైమాక్స్‌’ విడుద‌ల‌కు సిద్ధం

Friday, May 29, 2020 • తెలుగు Comments

వ‌ర్మ ‘క్లైమాక్స్‌’ విడుద‌ల‌కు సిద్ధం

క‌రోనా దెబ్బ‌కు సినీ ఇండ‌స్ట్రీ కుదేలైంది. సినిమా థియేట‌ర్స్ మూతప‌డ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయ‌నే దానిపై క్లారిటీ లేదు. అలాగే సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఇలాంటి త‌రుణంలో సినిమా షూటింగ్స్ చేయ‌డానికే ద‌ర్శ‌క నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. కానీ వ‌ర్మ మాత్రం క‌రోనాను భ‌యాన్ని ప‌క్క‌న పెట్టేశాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా అంటే అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారంటూ దానిపై రెండు పాట‌ల‌ను విడుద‌ల చేసిన వ‌ర్మ‌.. ఈసారి మ‌రో అడుగు ముందుకేసి ఏకంగా సినిమానే తెర‌కెక్కించేసి విడుద‌ల చేసేస్తున్నాడు.

గ‌తంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గాడ్ అంటూ సెక్స్ ట్రూత్ అనే సినిమాను తెర‌కెక్కించిన వ‌ర్మ ఈసారి క్లైమాక్స్ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆర్ఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రేయాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా నిర్మిత‌మైంది. ఈ చిత్రాన్ని జూన్ 6న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వ‌ర్మ అధికారికంగా ప్ర‌క‌టించారు. క్లైమాక్స్ సినిమాను ఆర్జీవీ వ‌ర‌ల్డ్ డాట్ ఇన్ లేదా శ్రేయాస్ ఈటీ ద్వారా విడుద‌ల చేస్తున్నాన‌ని సినిమా చూడాలంటే పే ఫ‌ర్ వ్యూ మోడ‌ల్‌లో వంద రూపాయ‌లు చెల్లించాలంటూ వ‌ర్మ ట్వీట్ చేశాడు. ఈ నెల 30.. అంటే రేపు ఈ సినిమాకు సంబంధించిన మ‌రో ట్రైల‌ర్‌ను వ‌ర్మ విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz