సుశాంత్ ప్రియురాలు.. రియా చక్రవర్తి అరెస్ట్

  • IndiaGlitz, [Tuesday,September 08 2020]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. ఇటీవల డ్రగ్ మాఫియాతో ఆమె జరిపిన వాట్సాప్ చాట్ బహిర్గతమైన విషయం తెలిసిందే. అలాగే విచారణలో కూడా సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియా స్వయంగా అంగీకరించింది. దీంతో రియాకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్టు ఎన్‌సీబీ గుర్తించి.. ఆమెను మంగళవారం ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.

కాగా.. రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని సైతం ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్‌సీబీ మూడు రోజులపాటు రియాను విచారించింది. మూడో రోజు విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే మూడో రోజు విచారణలో భాగంగా రియా తాను గంజాయి మాత్రమే కాకుండా ఇతర కెమికల్స్ కూడా వాడినట్టు అంగీకరించిందని సమాచారం.

డ్రగ్స్ మాఫియాతో రియా ఛాటింగ్ బహిర్గతమవడంతో ఎన్‌సీబీ రంగంలోకి దిగింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ను సైతం విచారించింది. అయితే ఈ విచారణలో రియా అంతా సుశాంత్ కోసమే చేశానని అని ఎన్‌సీబీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. సుశాంత్ నటించిన ఓ సినిమా సెట్‌లో డ్రగ్స్ వినియోగించారని రియా చెప్పడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం సమన్లు పంపాలని ఎన్‌సీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More News

నాన్నగారు ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య విషయమై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ గుడ్ న్యూస్ చెప్పీరు.

రచ్చ చేసిన కరాటే కల్యాణి.. నామినేషన్స్ లో గంగవ్వ..

తొలిరోజు బిగ్‌బాస్ షో ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైంది. కానీ ప్రేక్షకుల అంచనాలన్నీ మొదటి రోజే పటాపంచలయ్యాయి.

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరు..

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు.

ప్రియమణి ప్రధాన పాత్రలో బహుభాష చిత్రం 'కొటేషన్ గ్యాంగ్'

హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న కొత్త సినిమా ‘‘కొటేషన్ గ్యాంగ్’’.

చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అటు ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు.. ఇటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు ఏకకాలంలో గుప్పించారు.