సుమంత్ అశ్విన్ కోసం 'రైట్ రైట్' అంటూ విజిల్ ఊదిన సునీల్

  • IndiaGlitz, [Sunday,February 21 2016]
సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ, యూత్, ఫ్యామిలీస్ కి దగ్గయరయ్యారు సుమంత్ అశ్విన్. లవర్స్, కేరింత, కొలంబస్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈ యువహీరో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రైట్ రైట్'. సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బాహుబ‌లి' ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి క‌థానాయిక‌.
'రైట్ రైట్' సంస్థ కార్యాలయంలో ఆదివారం మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సునీల్ విజిల్ ఊది, రైట్ రైట్ అంటూ వెరైటీగా మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ...
సునీల్ మాట్లాడుతూ - ''నా చేతుల మీదగా ఈ పోస్టర్ విడుదల కావడం నా అదృష్టం. ఎమ్మెస్ రాజుగారి బేనర్లో 'మనసంతా నువ్వే'లో నేను చేసిన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ నా కెరీర్ కి బలమైన పునాది అయ్యింది. ఆ సినిమా చేసినప్పట్నుంచీ సుమంత్ అశ్విన్ నాకు క్లోజ్. తనని తమ్ముడూ అని పిలుస్తాను. బంగారంలాంటి కుర్రాడు. ఎమ్మెస్ రాజుగారు జస్ట్ స్టార్ నుంచి ఎందర్నో సూపర్ స్టార్స్ ని చేశారు. సుమంత్ అశ్విన్ కూడా స్టార్ హీరో కావాలని కోరుకుంటున్నాను. నా 'మర్యాద రామన్న'తో ప్రభాకర్ ఎంటరయ్యాడు. ఆ సినిమాలో అతన్ని చూస్తుంటే భయం వేసింది. ఈ సినిమాలో చూస్తుంటే లవ్ వస్తోంది. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ''సునీల్ నాకు చిన్నప్పట్నుంచీ క్లోజ్. షూటింగ్ లొకేషన్లో తనని అబ్జర్వ్ చేసేవాణ్ణి. సునీల్ ఈ మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నా, ప్రభాకర్ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది'' అన్నారు.
ప్రభాకర్ మాట్లాడుతూ - '' 'మర్యాద రామన్న'తో నా కెరీర్ ఆరంభం అయ్యింది. ఆ సినిమా అప్పుడు సునీల్ ఇచ్చిన సహకారాన్ని మర్చిపోలేను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 'రైట్ రైట్' సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుంది. ఈ చిత్రానికి అవకాశం ఇచ్చిన ఎమ్మెస్ రాజు గారికి, సుమంత్ అశ్విన్, దర్శకుడికి నా ధన్యవాదాలు'' అని చెప్పారు.
నిర్యాత జె. వంశీకృష్ణ మాట్లాడుతూ - ''ఈ నెల 22 నుంచి మార్చి 9 వరకు జరిగే షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది. ఏప్రిల్ లో పాటలను, మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.

More News

చిరు, చరణ్ సినిమాలకు బ్రేక్ పడుతుందా?

ఏడేళ్ళ తర్వాత కత్తి రీమేక్ చిత్రంలో నటించడానికి చిరంజీవి సిద్ధం అవుతున్నాడు.

లారెన్స్ ఇప్పుడు బండ్ల గణేష్ తో...

స్టార్ కొరియోగ్రాఫర్ నుండి స్టార్ డైరెక్టర్ గా మారిని రాఘవ లారెన్స్ ముని,కాంచన,గంగ వంటి హర్రర్ కామెడి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

'రన్' రిలీజ్ డేట్...

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ హీరో హీరోయిన్లుగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సమర్పణలో నూకయ్య పేమ్ అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో

'గుంటూరు టాకీస్' ఆడియో ఆవిష్కరణ

సిద్ధు జొన్నలగడ్డ,నరేష్ విజయ్ కృష్ణ,రేష్మీ గౌతమ్,శ్రద్ధాదాస్,లక్ష్మీ మంచు,మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్పై రాజ్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం గుంటూరు టాకీస్.

చైతు నెక్ట్స్ మూవీ కన్ ఫర్మ్

అక్కినేని నాగ చైతన్య -గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో చిత్రం చేస్తున్నారు.త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా తర్వాత చైతన్య నటిస్తున్న ప్రేమమ్ రిలీజ్ కానుంది.