'రైట్ రైట్' అంటున్న సాయిధరమ్ తేజ్

  • IndiaGlitz, [Friday,March 04 2016]

ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్ ఒకే ఏరియాలో పక్క పక్క జరిగితే.. ఆ ఇద్దరు హీరోలు బ్రేక్ టైమ్ లో కలుసుకుని, కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఆ హీరోలిద్దరూ మంచి స్నేహితులైతే చెప్పడానికి ఏముంది.. తాము చేసే చిత్రాలు హిట్టవ్వాలని కోరుకుంటారు. ఇటీవల సాయిధరమ్ తేజ్, సుమంత్ అశ్విన్ కలుసుకున్నప్పుడు అలానే ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. ఆ విషయంలోకి వస్తే..
సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సుప్రీమ్' చిత్రం షూటింగ్, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న 'రైట్ రైట్' షూటింగ్ ఇటీవల పక్క పక్కనే జరిగాయి. ఈ ఇద్దరూ చిన్నప్పట్నుంచీ మంచి స్నేహితులు. దాంతో బ్రేక్ టైమ్ లో 'సుప్రీమ్' హీరో సాయిధరమ్ తేజ్.. క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ ని కలవడానికి 'రైట్ రైట్' షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. ఈ స్నేహితులిద్దరూ కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. 'రైట్ రైట్'కి బృందానికి సాయిధరమ్ తేజ్ శుభాకాంక్షలు చెప్పి, మళ్లీ తన షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు.
సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'రైట్ రైట్‌'. 'బాహుబ‌లి' ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంతో జరుగుతోంది. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

More News

సూర్య 24 టీజ‌ర్ రివ్యూ..

సూర్య హీరోగా మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న సెన్సేష‌న‌ల్ మూవీ 24. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ & 2 డి ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో  సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

శ‌ర‌త్ కుమార్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విశాల్

శ‌ర‌త్ కుమార్ పై హీరో విశాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ఇంత‌కీ విశాల్ ఫిర్యాదు చేయ‌డానికి కార‌ణం ఏమిటంటే...న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు వివాద‌స్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో శ‌ర‌త్ కుమార్ వ‌ర్గం పై విశాల్ వ‌ర్గం గెలుపొందింది.

స‌ర్ధార్ లో..చిరు సాంగ్ కి ప‌వ‌న్ స్టెప్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప‌వ‌న్ - కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.

ఉమెన్స్ డే కోసం శృతిపాట...

ప్రస్తుతం నార్త్,సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కమల్ హాసన్ గారాల తనయ శృతిహాసన్ బేసిక్ గా మ్యూజిషియన్ అండ్ సింగర్ కూడా అన్న సంగతి అందరికీ తెలిసిందే.

వందకు పైగా సెంటర్స్ లో సోగ్గాడు అర్థశత దినోత్సవం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ...నిర్మించిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.