అదరగొట్టే బీట్ తో 'దిగుదిగుదిగు నాగ' సాంగ్.. ఊరిస్తున్న రీతూ వర్మ

  • IndiaGlitz, [Wednesday,August 04 2021]

క్రేజీ హీరో నాగశౌర్య, యంగ్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లేడి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. రీతూ వర్మ, నాగ శౌర్య ఫస్ట్ గ్లింప్సె లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం కోసం రెడీ చేసిన ఫోక్ సాంగ్ 'దిగు దిగు దిగు నాగ' లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. దిగు దిగు దిగు నాగ జానపద పాటకు పల్లెల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ సాంగ్ ని వరుడు కావలెను చిత్రం కోసం లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రీ క్రియేట్ చేశారు.

అనంత్ శ్రీరామ్ లిరిక్స్ కి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి బీట్ తో సంగీతం అందించారు. లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. మాస్ కు బాగా చెరువవుతుంది అనడంలో సందేహం లేదు.

ఇక హీరోయిన్ రీతూ వర్మ స్టెప్పులని కూడా లిరికల్ వీడియోలో చూపించారు. లయబద్దంగా రీతూ వర్మ అద్భుతంగా డాన్స్ చేసినట్లు ఉంది. వీడియో సాంగ్ చూస్తే అనుభూతి ఇంకా పెరుగుతుందేమో. ఈ సాంగ్ థియేటర్స్ లో ప్రేక్షకులకు కనుల పండుగే అని చెప్పొచ్చు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా నాగశౌర్య మరోవైపు లక్ష్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీతూ వర్మ నాని సరసన టక్ జగదీశ్ లో, శర్వానంద్ కి జోడిగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటిస్తోంది.

More News

హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన రాక్షసుడు చిత్రం మంచి విజయం సాధించింది. క్రైమ్, అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ఆధ్యంతం ప్రేక్షకులని ఆకట్టుకుంది.

'RRR'కి ముందు రాజమౌళి పరిశీలించిన కాంబినేషన్స్ ఇవే.. అలియా ప్రతి సీన్ లో..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నప్పటి నుంచి ఈ చిత్రం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

నాగ్ మూవీలో రంభగా బిగ్ బాస్ బ్యూటీ.. 'బంగార్రాజు'పై లేటెస్ట్ అప్డేట్!

ఐదేళ్ల క్రితం కింగ్ నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' మూవీపై ఫిర్యాదు.. బూతు సన్నివేశాల్లో అలా..

ఇటీవల ఓటిటీలు, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఎక్కువైనప్పటి నుంచి బోల్డ్ కంటెంట్ చిత్రాలు కూడా ఎక్కువవుతున్నాయి.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'పుష్ప'.. బాలీవుడ్ స్టార్ తో బన్నీ పోటీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో