close
Choose your channels

అదరగొట్టే బీట్ తో 'దిగుదిగుదిగు నాగ' సాంగ్.. ఊరిస్తున్న రీతూ వర్మ

Wednesday, August 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రేజీ హీరో నాగశౌర్య, యంగ్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లేడి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. రీతూ వర్మ, నాగ శౌర్య ఫస్ట్ గ్లింప్సె లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం కోసం రెడీ చేసిన ఫోక్ సాంగ్ 'దిగు దిగు దిగు నాగ' లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. దిగు దిగు దిగు నాగ జానపద పాటకు పల్లెల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ సాంగ్ ని వరుడు కావలెను చిత్రం కోసం లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రీ క్రియేట్ చేశారు.

అనంత్ శ్రీరామ్ లిరిక్స్ కి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి బీట్ తో సంగీతం అందించారు. లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. మాస్ కు బాగా చెరువవుతుంది అనడంలో సందేహం లేదు.

ఇక హీరోయిన్ రీతూ వర్మ స్టెప్పులని కూడా లిరికల్ వీడియోలో చూపించారు. లయబద్దంగా రీతూ వర్మ అద్భుతంగా డాన్స్ చేసినట్లు ఉంది. వీడియో సాంగ్ చూస్తే అనుభూతి ఇంకా పెరుగుతుందేమో. ఈ సాంగ్ థియేటర్స్ లో ప్రేక్షకులకు కనుల పండుగే అని చెప్పొచ్చు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా నాగశౌర్య మరోవైపు లక్ష్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీతూ వర్మ నాని సరసన టక్ జగదీశ్ లో, శర్వానంద్ కి జోడిగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.