close
Choose your channels

హైదరాబాద్ నవాబ్ 2 మిమ్మల్ని నవ్విస్తుంది - నిర్మాత, దర్శకులు ఆర్.కె

Wednesday, July 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్ నవాబ్ 2 మిమ్మల్ని నవ్విస్తుంది - నిర్మాత, దర్శకులు ఆర్.కె

2006 లో వచ్చిన హైదరాబాద్ లో వచ్చిన హైదరాబాద్ నబాబ్ సినిమాకు సీక్వెల్ హైదరాబాద్ నవాబ్ 2 జులై 19న విడుదల కానుంది. ఆర్.కె నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

నిర్మాత, దర్శకుడు ఆర్.కె మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాయడం జరిగింది. ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రెండు గంటలు ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. హీరోలు, హీరోయిన్స్ అందరూ బాగా నటించారు. చక్కని పాటలు ఉన్నాయి. జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. హైదరాబాద్ లోకల్ కల్చర్ ను బేస్ చేసుకొని తీసాం. మీ అందరి సపోర్ట్ కావాలి.

ఆర్టిస్ట్ రఘు మాట్లాడుతూ... 'జులై 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆధారిస్తారని నమ్ముతున్నాము. ఈ మూవీలో మంచి పాత్ర చెయ్యడం జరిగింది. నిర్మాత దర్శకుడు ఆర్.కె మరిన్ని మంచి చిత్రాలు చెయ్యాలని కోరుకుంటున్న' అన్నారు.

హీరో అలీ రజీత్ మాట్లాడుతూ... '2006 లో హైదరాబాద్ నవాబ్ చూసాను, బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో నటించడానికి అవకాశం రావడం ఆనందంగా ఉంది. ధ్రువ సినిమాలో చిన్న పాత్ర చేసాను అలాగే సీరియల్స్ లో నటించాను. హైదరాబాద్ నవాబ్2 మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ... నేను రవిబాబు గారి సినిమాలకు మ్యూజిక్ చెయ్యడం జరిగింది. ఈ సినిమాలో పాటలన్ని బాగా వచ్చాయి.

హీరో అజీజ్ మాట్లాడుతూ... స్క్రిప్ ఈ సినిమాకు హీరో. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. కామెడీ ఈ సినిమాలో మెయిన్ హైలెట్. సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. జులై 19న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్న అన్నారు

హీరోయిన్ ఫరా ఖాన్ మాట్లాడుతూ... 'నాకు ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆర్.కె గారికి ధన్యవాదాలు. హైదరాబాదీ అమ్మాయిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాను. టీమ్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్న' అన్నారు.

హీరోయిన్ సూఫీ ఖాన్ మాట్లాడుతూ... 'ఆర్.కె మామ గారికి థాంక్స్, టీం అందరూ కలిసి మంచి సినిమాను నిర్మించాము. అన్నీ పాటలు బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మంచి సాంగ్స్ ఇచ్చారు. సినిమా బాగుంటుంది' అన్నారు.

సమైరా మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నాకు నటించడానికి అవకాశం ఇచ్చిన మామ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో కామిడి మీ అందరికి నచ్చుతుంది. కుటుంభం అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి' అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.