రోబో సీక్వెల్ రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్, ఎమీజాక్స‌న్‌ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రీసెంట్‌గా పూర్త‌య్యింది. ఇప్ప‌టికీ 50 శాతానికి పైగానే సినిమా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌, ఎమీజాక్స‌న్‌ల‌పై సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. న‌వంబ‌ర్‌లో సినిమాను ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తాజా స‌మాచారం ప్ర‌కారం తెలుగు, త‌మిళం, హిందీలో ఈ సినిమాను 2017 అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేయాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ని స‌మాచారం.