ఒకే ఒక సాంగ్ తో 'రోబో' సీక్వెల్

  • IndiaGlitz, [Monday,October 31 2016]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్,ఎమీజాక్స‌న్‌ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. 300 కోట్లకు పైగా భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. హై బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 2010లో విడుద‌లై స‌న్సేష‌న్ క్రియేట్ చేసిన రోబోను మించేలా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు శంక‌ర్‌. అక్ష‌య్‌కుమార్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను న‌వంబ‌ర్ 20న విడుద‌ల చేస్తున్నారని, టీజ‌ర్‌ణు సంక్రాంతికి విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు.

ఈ చిత్రంలో కేవ‌లం ఓ పాట మాత్ర‌మే ఉంటుంద‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సాధారణంగా ఇండియ‌న్ సినిమా ఆల్బ‌మ్‌లో ఐదారు సాంగ్స్ ఉంటాయి. కానీ 2.0లో కేవ‌లం ఒక పాట మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఆ పాట‌ను ఉక్రెయిన్‌లో చిత్రీక‌రించార‌ట‌. మ‌రి ఈ పాటను శంక‌ర్ ఏ రేంజ్‌లో చేశారో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే....

More News

శతమానంభవతి ఆడియో&మూవీ రిలీజ్ డేట్ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం శతమానంభవతి.

'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'.

చిత్రీకరణ దశలో 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'.

3 రోజుల్లోనే 11 కోట్లు కలెక్ట్ చేసిన కార్తీ, పివిపిల దీపావళి బ్లాక్ బస్టర్ 'కాష్మోరా'

పివిపి సినిమా బేనర్ లో ప్రసాద్ వి.పొట్లూరి ఎన్నో భారీ చిత్రాలను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

చైతన్య కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకువెళ్లే సినిమా సాహసం శ్వాసగా సాగిపో - గౌతమ్ మీనన్

అక్కినేని నాగచైతన్య,మంజిమ మోహన్ జంటగా నటించిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో