close
Choose your channels

నేను ఐరెన్‌లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్!

Friday, May 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

"ఐరన్‌లెగ్‌ .. రోజా గెలిస్తే జగన్‌ సీఎం కాలేరని విమర్శించిన వారందరికీ నా విజయం చెంపపెట్టు.. నాది గోల్డెన్‌ లెగ్‌.. నేను ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తాను" అని వైసీపీ నుంచి వరుసగా రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.

నగరి నుంచి రోజా గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నగరి అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా పాదాభివందనాలు తెలుపుకుంటున్నట్టు ఫేస్‌బుక్‌లోనూ రోజా ఓ పోస్ట్ పెట్టారు.

హామీ ఇస్తున్నా..!

"రాజన్న పాలనలో మాదిరిగా జగన్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారు. అనేక సంక్షేమ పథకాలతో అందరూ సుఖంగా ఉంటారని హామీ ఇస్తున్నాను. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర మహిళలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. రోజా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని రోజా తన ఫేస్‌బుక్‌ పోస్టులో రాసుకొచ్చారు. కాగా నగరి నుంచి 2014, 2019లో రోజా వరుసగా రెండుసార్లు ఘన విజయం సాధించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.