పవన్ కల్యాణ్‌పై రోజా సంచలన కామెంట్స్

  • IndiaGlitz, [Saturday,March 23 2019]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా సంచలన కామెంట్స్ చేశారు. రోజా చేసిన ఈ హాట్ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యాయి. శుక్రవారం రోజున నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ‌త్వ పాల‌న‌కు ప్రజ‌లు బుద్ధి చెప్పబోతున్నారని.. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.

ఇది మాట మార్చడం కాదా..!?

మొన్నటి వ‌ర‌కు విడివిడిగా ఉన్నట్లు క‌నిపించినా కూడా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కు అయిపోయాయి. వాళ్లిద్దరూ క‌లిసి ప్రజ‌ల‌ను మోసం చేస్తున్నార‌ు. లోకేష్‌ అవినీతిని ముందు నుంచి ప్రశ్నిస్తూ వ‌చ్చిన పవన్ క‌ళ్యాణ్ ఇప్పుడు త‌న మాట మార్చారు. నగరి నియోజకవర్గంలో ఉన్న దళితుల ఓట్లు చీల్చేందుకే ఇక్కడ ద‌ళిత పార్టీగా ముద్ర ప‌డిన బీఎస్పీకి సీటు కేటాయించారు. 2014లో నేను గెలిచిన రోజు నుంచి కూడా కావాల‌నే కక్షపూరితంగా అధికార పార్టీ వ్వవ‌హరించింది. నగరి నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇలాంటి పార్టీతో మ‌ళ్లీ ప‌వ‌న్ క‌లిసి ప‌ని చేయ‌డం మాట మార్చడం కాదా..? అని రోజా వ్యాఖ్యానించారు. అయితే రోజా వ్యాఖ్యలకు పవన్, నాగబాబుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

అఫిడవిట్ ప్రకారం పవన్ ఆస్తులు ఇవీ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

జ‌య‌ల‌లిత‌గా కంగ‌నా ర‌నౌత్‌

త‌మిళ‌నాడు దివ‌తంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లితకు సంబంధించి మూడు బ‌యోపిక్స్‌ను అనౌన్స్ చేశారు.

జనసేన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు

లోక్‌స‌భ అభ్య‌ర్ధి అంటే రూ. 100 కోట్లు- రూ. 70 కోట్ల పెట్టుబ‌డి వ్యాపారం అయిపోయింద‌నీ, జ‌న‌సేన పార్టీ పెట్టుబ‌డి లేని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని నిర్మిస్తుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్

భీమ‌వ‌రంను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దుతా...

"భీమవరం ప్రజల ప్రేమానుబంధాలు నన్ను కట్టిపడేశాయి. ఈ పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం నా బాధ్యత. రాజ‌కీయం భావ‌జాలంతో ముడిప‌డి ఉండాలి కానీ కులంతో కాద‌ని, త‌న‌కు కులం మ‌తం లేదు మాన‌వ‌త్వమే ఉంది"

వివేకా హత్యపై పవన్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకా హత్యపై జనసేన అధినేత స్పందించారు. "ఇంత‌కీ అస‌లు పులివెందుల‌లో ఏం జ‌రుగుతోంది.