close
Choose your channels

జూనీయర్ ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నారు - రోజా

Tuesday, March 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జూనీయ‌ర్ ఎన్టీఆర్ ని సినీ ఇండ‌స్ట్రీలో ఎద‌గ‌నీయ‌కుండా చంద్ర‌బాబు నాయుడు ఇన‌ప‌పాదంతో తొక్కేస్తున్నార‌ని వై.ఎస్.ఆర్.సి.పీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అసెంబ్లీకి అనుమ‌తించ‌క‌పోవ‌డం గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాలు చేస్తూ రోజా ఈరోజు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.
ఈ సంద‌ర్భంగా .....
ఢిల్లీలో సినీ న‌టి & ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ...ఎన్టీఆర్ పేరు అంటే చంద్ర‌బాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుక‌నే జూనీయ‌ర్ ఎన్టీఆర్ ని 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో వాడుకుని ఇప్పుడు వ‌దిలేసాడు. క‌నీసం ఎన్టీఆర్ ని కార్య‌క‌ర్త‌గా కూడా గుర్తించ‌డం లేదు. ఎన్టీఆర్ సినిమాలు విడుద‌ల కానివ్వ‌కుండా...ఆడ‌నీయ‌కుండా తొక్కేస్తున్నారు చంద్ర‌బాబు. జూనీయ‌ర్ ఎన్టీఆర్ ఛ‌రిష్మా ముందు త‌న ప‌ప్పు సుద్ద కొడుకు లోకేష్ ఎద‌గ‌లేడ‌నే భ‌యంతో ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నార‌ని రోజా విమ‌ర్శించారు. మ‌రి...రోజా విమ‌ర్శ‌ల పై చంద్ర‌బాబు కానీ...ఎన్టీఆర్ కానీ స్పందిస్తారేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.