న‌లుగురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంభం

  • IndiaGlitz, [Monday,January 21 2019]

బ్లాక్ అండ్ వైట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. హిమ బిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో బాలు ద‌ర్శక‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సంద‌ర్భంగా ...

ద‌ర్శ‌కుడు బాలు మాట్లాడుతూ - '' మ‌హాన‌గ‌రంలో నివ‌సిస్తూ స్వ‌తంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం. త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ నలుగురు అమ్మాయిలుగా న‌టిస్తున్నారు. కామెడీ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో క‌థానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి'' అన్నారు.

నిర్మాత హిమబిందు వెల‌గ‌పూడి మాట్లాడుతూ - ''హైద‌రాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రిలో గోవాలో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీక‌రిస్తాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ర‌ఘుకుంచె, సినిమాటోగ్ర‌ఫీ: శేఖ‌ర్ గంగ‌మోని, పాట‌లు: భాస్క‌ర భ‌ట్ల‌, ల‌క్ష్మీ భూపాల్‌, ఎడిటింగ్‌: నాగేశ్వ‌ర్ రెడ్డి, పి.ఆర్‌.ఒ: ఫ‌ణి - నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విక్కీ రొల‌ర్ కొస్ట‌ర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: సాయికుమార్ పాల‌కూరి, స‌హ నిర్మాత‌లు: రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి, నిర్మాత‌: హిమ బిందు వెల‌గపూడి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బాలు.

More News

చిరంజీవి క్లాప్ తో ప్రారంభమయిన సాయి ధరమ్ తేజ్ తమ్ముడి చిత్రం

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్  రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది..

'సమాజానికో హెచ్చరిక' చిత్రం రికార్డింగ్ ప్రారంభం

చామకూరి కంబైన్స్ 'సమాజానికో హెచ్చరిక' సినిమా పాటల రికార్డింగ్ S.A స్టూడియో లో ప్రారంభమైంది.

క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా 'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ 'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా,

ఒక్కరోజులోనే 'మిస్టర్‌ మజ్ను' ట్రైలర్‌కు 5 మిలియన్‌ వ్యూస్‌

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో

అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన 'లవర్స్ డే ' ఆడియో రిలీజ్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌ ‘ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్