‘రొమాంటిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

  • IndiaGlitz, [Monday,March 01 2021]

ఆకాశ్‌పూరి హీరోగా రూపొందుతోన్న ‘రొమాంటిక్’ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్, చార్మి నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. అనిల్ పాడూరి ద‌ర్శ‌కుడు. క‌రోనా లేకుండా ఉండుంటే ఈ వేసవిలో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం విడుదల ఎట్ట‌కేల‌కు ఖ‌రారైంది. జూన్ 18న ‘రొమాంటిక్’ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. హీరో హీరోయిన్ మ‌ధ్య లిప్ లాక్స్‌, బీచ్ సాంగ్ ఇలా రొమాంటిక్‌లో హాట్ నెస్ డోసును బాగానే ద‌ట్టించిన‌ట్లు పోస్ట‌ర్స్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

ఆంధ్రాపోరి, మెహ‌బూబాతో హీరోగా ప్ర‌య‌త్నం చేసిన ఆకాశ్ పూరీకి పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. మ‌రిప్పుడు రొమాంటిక్ ఎలాంటి స‌క్సెస్‌నిస్తుందో చూడాలి. ఈ సినిమా విష‌యంలో పూరీ జ‌గ‌న్నాథ్ బాగానే ఇన్‌వాల్వ్ అయిన‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. డైరెక్ట‌ర్ పేరుకి అనిల్ పాడూరి కానీ.. సినిమాను పూరి తెర‌కెక్కించాడ‌ట‌. అనిల్ పాడూరి అనుకున్న రేంజ్‌లో సినిమాను తెర‌కెక్కించ‌క‌పోవ‌డంతో పూరి జ‌గ‌న్నాథ్ రంగంలోకి దిగాల్సి వ‌చ్చింద‌ట‌. అలాగే పూరీ జ‌గ‌న్నాథ్ హీరోయిన్స్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వ‌స్తుంది. మ‌రి రొమాంటిక్ సినిమా కోసం అందాల‌ను ఆర‌బోస్తున్న కేతికా శ‌ర్మ కెరీర్‌కు.. ఈ సినిమా ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.