రోమియో ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Thursday,January 03 2019]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా 20వ చిత్రం ..'జిల్' ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం సాహో చిత్రీక‌రణ‌లో బిజీగా ఉన్న ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాడు.

ఒక‌ప్ప‌టి రోమియో జూలియ‌ట్ ప్రేమ‌క‌థ‌ను నేటి ట్రెండ్‌కు త‌గిన విధంగా మార్పులు చేసి తెర‌కెక్కించ‌బోతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. గోపీ కృష్ణామూవీస్‌, యు.వి.క్రియేష‌న్స్ క‌ల‌యిక‌లో సినిమా తెర‌కెక్క‌నుంది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఎక్కువ భాగం యూర‌ప్‌లో సినిమా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాల‌పై అంచ‌నాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కించ‌బోతున్నారు.