close
Choose your channels

హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన ఆలియా భ‌ట్‌

Wednesday, January 20, 2021 • తెలుగు Comments

హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన ఆలియా భ‌ట్‌

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్‌... స్వ‌ల్ప అస్వ‌స్థ‌తకు లోను కావ‌డంతో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యింది. ఇంత‌కీ ఆలియా భ‌ట్‌కు స‌మ‌స్యేంటి? అనే వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం ఆలియా భ‌ట్ న‌టిస్తోన్న చిత్రం గంగూబాయ్ క‌తియావాడి. సంజ‌య‌లీలా భ‌న్సాలీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో హైప‌రాసిడిటీ, ఆల‌స‌ట‌, వికారంతో బాధ‌ప‌డ‌టంతో ముంబైలోని ప్ర‌ముఖ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. చెక‌ప్ అనంత‌రం డిశ్చార్జ్ అయ్యారు. ముంబై లేడీ మాఫియా డాన్ గంగూబాయ్ జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఆపాలంటూ గంగూబాయ్ త‌న‌యుడు లీగ‌ల్ నోటీసులు పంపాడు. ఈ లీగ‌ల్ స‌మ‌స్య న‌డుమే ఈ సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయాల‌నేది ద‌ర్శ‌క, నిర్మాత‌లు ప్లాన్‌.

ఈ సినిమాతో పాటు ఆలియా భ‌ట్‌.. ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో క‌లిసి బ్ర‌హ్మ‌స్త్ర సినిమాలో న‌టిస్తుంది. మ‌రో వైపు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ట్రిపులార్ సినిమాలోనూ ఆలియాభట్ న‌టించింది. అలాగే రణ్‌బీర్ కపూర్‌తో ఈ ఏడాది పెళ్లి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రణ్‌భీర్, ఆలియా భట్ పెళ్లిపై క్లారిటీ వస్తుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz