close
Choose your channels

రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్‌' ఆ సినిమాకు కాపీనా ?

Tuesday, March 31, 2020 • తెలుగు Comments

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌ ఆ సినిమాకు కాపీనా ?

ర్శ‌క‌ధీరుడుగా పేరున్న రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వీడియో ప్రోమోకు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న వ‌స్తుంది. అయితే ఓ వ‌ర్గం మాత్రం రాజ‌మౌళి మోష‌న్ పోస్ట‌ర్‌ను కాపీ కొట్టాడ‌ని అంటోంది. వివ‌రాల్లోకెళ్తే.. ఎమోష‌న్స్‌ను, హీరోయిజాన్ని మిక్స్ చేసి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించ‌డంలో రాజ‌మౌళి దిట్ట‌. అందుకే ఆయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అప‌జ‌యమే లేదు.

అయితే ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన‌ట్లు ఓవ‌ర్గం మాత్రం.. రాజ‌మౌళి ‘రౌద్రం ర‌ణం రుధిరం’ ను మూడు ద‌శాబ్దాల క్రింద‌ట వ‌చ్చిన ఓ హాలీవుడ్ సినిమా ‘ఫైర్ అండ్ ఐస్‌’కు లింకు పెట్టి మాట్లాడుతున్నారు. 1983లో విడుద‌లైన ఫాంట‌సీ అడ్వెంచ‌ర‌స్ మూవీ ‘ఫైర్ అండ్ ఐస్‌’కు రాజ‌మౌళి సినిమా కాపీ అని అంటుంది. రాజ‌మౌళికి ఇలాంటి విమ‌ర్శ‌లు రావ‌డం కొత్తేమీ కాదు. మ‌రి ఇప్పుడు వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఆయ‌నేమైనా స‌మాధానం ఇస్తారా? లేక త‌న‌దైన శైళిలో సినిమాను ప్రేక్ష‌కుల‌కు ముందుకు తెచ్చి స‌క్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz