రానా-తేజ కాంబోలో ‘RRR’!!!

  • IndiaGlitz, [Thursday,January 23 2020]

ఇదేంటి.. ఆల్రెడీ కుర్ర స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను పెట్టి దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ‘RRR’ భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారుగా.. మళ్లీ ఈ ‘RRR’ ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. రానా దగ్గుబాటి హీరోగా ‘RRR’ సినిమా వస్తోందట. ఈ చిత్రాన్ని అప్పట్లో ఓ వెలుగు వెలిగిన తేజ తెరకెక్కిస్తున్నారట. ఇంతకీ ఆ ‘RRR’ సంగతేంటి..? జక్కన్నకు పోటీగా ఈయనెందుకు ఇలాంటి సినిమా చేయాల్సి వచ్చింది..? జక్కన్న ‘RRR’కు.. తేజ ‘RRR’కు తేడా ఏంటి..? అనే ఆసక్తికర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

రానాకు కష్టకాలంలో ‘నేనేరాజు నేనేమంత్రి’ అనే సినిమాను ఇచ్చి మళ్లీ దగ్గుబాటిని ఓ రేంజ్‌కు లేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాక భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.. అంతేకాదు రానా కెరియర్లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అప్పుడెప్పుడో కలిసి సినిమా చేశాం కదా.. మళ్లీ ఇంకో సినిమా ఇదే కాంబోలో తీసేస్తే పోలా.. అనే ఆలోచన ఇద్దరికీ వచ్చిందట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరూ కలిసి కూర్చోవడం.. లైన్ వినడం అన్నీ జరిగిపోయాయట.

అంతేకాదండోయ్.. సినిమాకు టైటిల్ కూడా అనేసుకున్నారట. ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అంటే ‘ఆర్ఆర్ఆర్’ అన్న మాట. ఇది ఓ విభిన్నమైన కథ అని టాక్ నడుస్తోంది. ఈ కథలో రానా పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. అన్నీ అనుకన్నట్లు జరిగితే ప్రస్తుతం రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ తర్వాత ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ తెరకెక్కించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ పుకారులో ఎంత నిజముందో తెలియాలంటే అటు దగ్గుబాటి లేదా.. ఇటు తేజ కాంపౌండ్ నుంచి రియాక్షన్ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే..!

More News

క‌రోనా వైర‌స్ ఎలా పుట్టిందో తెలిస్తే షాక‌వుతారు..?

ఇప్పుడు ప్ర‌పంచాన్ని ముఖ్యంగా చైనా దేశాన్ని భ‌య‌పెడుతున్న వైర‌స్ క‌రోనా. ఈ వైర‌స్ చైనాలోని ఉహాన్ న‌గ‌రంలో పుట్టింది.

‘అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ.. ఇప్పుడేమంటారు జనసైనిక్స్’

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీతో కలిసి అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలోని కమలనాథులతో భేటీ అయిన పవన్ కల్యాణ్..

ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)తో పొత్తు పెట్టుకుంటున్న‌ట్లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

పాపం థర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ... బ‌న్నీ సినిమాలో పొగొట్టుకున్న పాత్ర ఇదే!!

సినిమాల‌కు..రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధాలుంటాయ‌నే విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేర‌నే సంగతి తెలిసిందే.

మూడు రాజధానులు: వైసీపీకి వరుస షాక్‌లు!!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ గత 37 రోజులుగా రాజధాని రైతులు, రైతు కూలీలు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే.