close
Choose your channels

నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ లీక్డ్ ఫొటోస్

Thursday, March 4, 2021 • తెలుగు Comments

నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ లీక్డ్ ఫొటోస్

దర్శకధీరుడు రాజమౌళికి కొత్త టెన్షన్ పట్టుకుంది. సినిమా పరంగానే కానీ, టెక్నికల్ టెన్షన్ కాదు.. లీకేజీ రాయుళ్ల సమస్య. సినిమాను తెర‌కెక్కించి విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న రాజ‌మౌళికి కొంద‌రు లీకేజీ వీరులు కొత్త స‌మ‌స్య‌లు క్రియేట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలోని కొన్ని ఫొటోల‌ను నెట్టింట లీక్ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఒలివియా మోరిస్ లుక్స్ ఉన్నాయి. ఎంతో జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుక‌న్న‌ప్ప‌టికీ ఇలా సినిమాకు సంబంధించిన లుక్స్ లీక్ కావ‌డంతో చిత్ర యూనిట్‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. మ‌రి ఈ స‌మ‌స్య‌ను రాజ‌మౌళి ఎలా ప‌రిష్క‌రించుకుంటాడో చూడాలి మ‌రి.

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). మార్చి నెలనాటికంతా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌నే ప్లానింగ్‌తో జ‌క్క‌న్న షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకుని అందుకు త‌గిన‌ట్లు చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్నాడు. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయబోతున్న‌ట్లు యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌బోతున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, ఒలివియా మోరిస్‌, శ్రియా శ‌ర‌న్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz