close
Choose your channels

'RRR' మేకింగ్ వీడియో లీక్‌.. వైర‌ల్ అవుతున్న ఎన్టీఆర్ లుక్‌

Wednesday, December 11, 2019 • తెలుగు Comments

RRR మేకింగ్ వీడియో లీక్‌.. వైర‌ల్ అవుతున్న ఎన్టీఆర్ లుక్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ మల్టీస్టార‌ర్ `RRR`. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మాళి ద‌ర్శ‌క‌త్వంలో `బాహుబ‌లి` త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం వైజాగ్ అర‌కు ప్రాంతంలోఈ సినిమాలో క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ స‌న్నివేశాలకు సంబంధించిన చిన్నపాటి వీడియో ఒక‌టి ఇప్పుడు లీకైంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్ సుస్ప‌ష్టంగా ఉండ‌టంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతుంది.

తెలంగాణ‌ పోరాట యోధుడు కొమురం భీమ్  పాత్ర‌లో న‌టిస్తోన్న ఎన్టీఆర్ లుక్ మొత్తానికి లీకైంది. త‌ల‌పై ఎర్ర‌టి త‌ల‌పాగాతో ఎన్టీఆర్ వీడియోలో క‌న‌ప‌డుతున్నాడు. ఓ ఔత్సాహికుడు తీసిన వీడియో కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు సీక్రెట్ మెయిన్‌టెయిన్ చేస్తున్న జ‌క్క‌న్న సినిమాలో ఓ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు జ‌క్క‌న్న అండ్ టీం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు లీకైన ఈ వీడియోతో ఎన్టీర్ లుక్ తెలిసింది. అయితే మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఎలా ఉండ‌బోతున్నాడో అనే ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ చరణ్‌  జోడిగా నటిస్తుంది. అలాగే బ్రిటన్‌ నటి ఓలివిలియా మోరిస్‌ ఎన్టీఆర్‌ జోడిగా నటిస్తుంది. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్‌ వంటి హాలీవుడ్‌ తారలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. రూ.400  కోట్లకు పై బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ప్ర‌పంచ వ్యాప్తంగా 10 భాష‌ల్లో సినిమా విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 

Get Breaking News Alerts From IndiaGlitz