RRR:1YearOfHistoricalRRR: ఆర్ఆర్ఆర్ ప్రభంజనానికి ఏడాది.. 'నాటు నాటు' అంటూ స్టెప్పులేసిన ప్రపంచం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ఆర్ఆర్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాను కాదు.. భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రరాజం. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితగాథలు ప్రమాణికంగా కల్పిత కథతో ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన శిల్పం ఆర్ఆర్ఆర్. తెలుగు సినిమాను శాసించే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్న వారికి దానిని నిజం చేసి చూపారు జక్కన్న. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ హీరోలుగా నటించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. శ్రీయా శరణ్, సముద్రఖని తదితరులు కీలకపాత్ర పోషించారు. మార్చి 24న రిలీజైన ఈ సినిమా సౌత్ , నార్త్ , ఓవర్సీస్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల కలెక్షన్స్ సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
సరిగ్గా ఇదే రోజున రిలీజైన ఆర్ఆర్ఆర్:
కరోనా, లాక్‌డౌన్, ఇతర కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు 2022 మార్చి 25న విడుదలై ప్రభంజనం సృష్టించింది. రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పవర్‌ఫుల్ యాక్టింగ్, పాటలు, పోరాట దృశ్యాలు అన్నీ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేశాయి. థియేటర్‌లలో పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక.. అన్ని వుడ్‌లను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాటకు భారతీయులు, చైనీయులు, జపనీయులు, కొరియన్లు, రష్యన్లు , అమెరికన్లు ఇలా అన్ని దేశాల వారు చిందులేశారు.
ఆర్ఆర్ఆర్‌ను వరించిన ఆస్కార్ :
అలా ఏడాది కాలంలో ఆర్ఆర్ఆర్ ఎన్నో మైలురాళ్లను అందుకుని.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే అంతా టాలీవుడ్ వైపు చూసే పరిస్ధితి నెలకొంది. తెలుగు సినిమాకు కలలో కూడా ఊహించని.. ఆస్కార్ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ ప్రయాణంలో మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను ఆర్ఆర్ఆర్ తన ఖాతాలో వేసుకుంది. ఆర్ఆర్ఆర్ విడుదలైన ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. ‘‘ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడాది కావొచ్చు.. కానీ నేటికీ థియేటర్‌లలో ఆడుతోంది. కొన్ని చోట్ల హౌస్‌ఫుల్ కూడా అవుతోంది. ఈ ఫీలింగ్ అవార్డ్‌ల కంటే కూడా ఎక్కువ. మీరు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పడం అనేది చాలా తక్కువ’’ అంటూ పేర్కొంది. అలాగే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నిల్చొన్న ఫోటో.. దాని చుట్టూ ఆర్ఆర్ఆర్ గెలుచుకున్న అవార్డ్‌ల వివరాలను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout