close
Choose your channels

వివాదంలో RRR.. జక్కన్న ఏం చేస్తారో!?

Monday, October 21, 2019 • తెలుగు Comments

వివాదంలో RRR.. జక్కన్న ఏం చేస్తారో!?

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకూ ఎలాంటి వివాదాలు లేకుండా షూటింగ్ సాఫీగా జరుపుకున్న ఈ చిత్రానికి తాజాగా ఊహించని షాక్ తగిలింది.

జక్కన్నకు స్ట్రాంగ్ వార్నింగ్!!

అల్లూరి సీతారామరాజు, కొమ్రుంభీంకు వాస్తవానికి చరిత్ర ప్రకారం ఎలాంటి సంబంధాల్లేవ్. అయితే ఈ సినిమాలో మాత్రం ఇద్దరికీ పరిచయం ఉన్నట్లు.. స్నేహితులుగా జక్కన్న తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం.. ఆర్ఆర్ఆర్ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతోంది. అల్లూరి సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు మీడియా ముందుకొచ్చి జక్కన్నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇంతకీ వివాదం ఏంటి..!?

‘సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం తగదు. సినిమా పేరుతో తమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకుడికి అస్సలు తగదు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో జన్మించారు. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారు. అయితే అదే సమయంలో కొమురం భీం 1901లో జన్మించి.. 1941లో తుదిశ్వాస విడిచారు. అయితే అల్లూరి-కొమ్రం ఇద్దరికీ పరిచయం లేదు. అసలు వీరిద్దరికీ పరిచయం ఉన్నట్లు కానీ.. స్నేహం ఉన్నట్లు కానీ చరిత్రలో అస్సల్లేదు. అయితే సినిమాలో మాత్రం పరిచయాలు ఉన్నాయని తెరకెక్కిస్తాననడం సరికాదు. చరిత్రలో లేని విషయాలను సినిమాలో చూపించడం సబబు కాదు. చరిత్రను వక్రీకరిస్తే మాత్రం పరిస్థితులు మామూలుగా ఉండవ్.. ఉన్నది ఉన్నట్లే తెరకెక్కిస్తే అందరికీ మంచిది’ అని వీరభద్రరావు.. రాజమౌళికి ఒకింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఏం ఆశిస్తున్నారు..!?

అయితే ఈ వ్యవహారంపై జక్కన్న అండ్ కో బృందం ఎలా రియాక్ట్ అవుతుందో మరి. కాగా.. ఇటీవల రిలీజైన భారీ బడ్జెట్ చిత్రాలు వివాదంలో చిక్కుకోవడం.. ఆ తర్వాత సమస్యలు పరిష్కరించుకోవడం.. ఈ పంచాయితీలు కోర్టుదాకా వెళ్లడం కూడా జరిగిన విషయం విదితమే. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ విషయంలో డబ్బులు డిమాండ్ చేయడం.. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ వివాదం ఎంతవరకు వెళ్తుందో..? అసలు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఏం ఆశిస్తోందో అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz