ఈ టైంలో మా వల్ల కాదు .. ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా, చిత్రయూనిట్ అధికారిక ప్రకటన

అనుకున్నదే నిజమైంది.. ఊహాగానాలే వాస్తవాలయ్యాయి. టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయలేమని చెబుతూ 'ఆర్ఆర్ఆర్' యూనిట్ ప్రేక్షకులను క్షమాపణలు కోరింది.

తాము తీవ్రంగా ప్రయత్నించినా... కొన్ని పరిస్థితులు మా నియంత్రణలో లేవు. మాకు మరో ఆప్షన్ లేదు. అందుకని, మీ ఎగ్జైట్‌మెంట్‌ను మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాం. సరైన సమయంలో... భారతీయ సినిమాకు పూర్వ వైభవం తీసుకు వస్తామని మాట చేస్తున్నాం అని 'ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ ట్వీట్ చేసింది.

వాస్తవానికి ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రెండు మూడుసార్లు వాయిదా పడింది. అప్పుడు దేశంలో కరోనా, లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ జరగలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. జనవరి 7న సినిమా విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఓవ‌ర్‌సీస్‌కు ప్రింట్స్ పంపించేశారు. ప్రమోషన్స్ సైతం భారీగా జరుగుతున్నాయి. నోటి దాకా వచ్చిన సమయంలో వాయిదా అంటే నిర్మాతలకు, అభిమానులకు నిరాశే.

ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

More News

బంగార్రాజు టీజర్‌ : నాగ్, చైతూ కుమ్మేశారుగా.. సంక్రాంతికి విందు భోజనమే..!!

కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం బంగార్రాజు .

పుకార్లే నిజమయ్యాయి, షణ్ముఖ్‏తో ఐదేళ్ల బంధానికి బ్రేకప్.. దీప్తి సునయన ఎమోషనల్ పోస్ట్

యూట్యూబర్, టిక్‌టాక్  స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌కు బిగ్‌బాస్ ఏమాత్రం కలిసొచ్చినట్లుగా లేదు. తృటిలో బిగ్‌బాస్ టైటిల్‌ను చేజార్చుకున్న షన్మూ..

శ్రీకాళహస్తిలో కంగనా రనౌత్ రాహుకేతు పూజలు

బాలీవుడ్ అగ్ర కథానాయిక, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

న్యూ ఇయర్ వేళ మెగా - నందమూరి అభిమానులకు చేదువార్త.. 'ఆర్ఆర్ఆర్' వాయిదా..?

అనుకున్నట్లుగానే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమను మరోసారి కష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందు పడ్డ

ఆర్ఆర్ఆర్ నుంచి 'రామం రాఘవం' సాంగ్... అల్లూరిగా నెత్తురు వేడెక్కించిన చరణ్

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' . సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా