close
Choose your channels

మెగా నందమూరి ఫ్యాన్స్‌కు ఊరట.. ‘‘ఆర్ఆర్ఆర్’’ కొత్త రిలీజ్ డేట్, ఈ రెండింటిలో ఏదో ఒకరోజు

Friday, January 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా నందమూరి ఫ్యాన్స్‌కు ఊరట.. ‘‘ఆర్ఆర్ఆర్’’ కొత్త రిలీజ్ డేట్, ఈ రెండింటిలో ఏదో ఒకరోజు

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. షెడ్యూల్ ప్రకారం జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ .. కరోనా, ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. అనేక రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యూపెన్సీకే థియేటర్లు నడవాలని ప్రభుత్వాలు ఆదేశించడంతో ఆర్ఆర్ఆర్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోక తప్పలేదు. దీంతో అప్పటి వరకు పడిన శ్రమ, ప్రమోషన్ల కోసం పడిన ప్రయాస అంతా వృథా అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా- నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మార్చి 18న లేదంటే.. ఏప్రిల్ 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. "దేశంలో కోవిడ్ తగ్గి... థియేటర్లు తెరుచుకుని ఫుల్ కెపాసిటీతో రన్ అయితే... మార్చి 18న సినిమా విడుదల చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. లేనిపక్షంలో ఏప్రిల్ 29న సినిమా విడుదల అవుతుంది" అని 'ఆర్ఆర్ఆర్' టీమ్ పేర్కొంది.

ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.