close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు కరోనా పాజిటివ్

Friday, August 7, 2020 • తెలుగు Comments

‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి టాలీవుడ్‌పై పంజా విసిరింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఆ తరువాత ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తదితరులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు వెంటవెంటనే ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు, నిర్మాతలకు కరోనా సోకడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.

Get Breaking News Alerts From IndiaGlitz