close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్’ సర్‌ప్రైజ్.. ఓ రేంజ్‌లో ఉంది..

Friday, April 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఆర్ఆర్ఆర్’ సర్‌ప్రైజ్.. ఓ రేంజ్‌లో ఉంది..

దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా ఓ అప్‌డేట్ విడుదలై అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్‌ప్రైజ్ నేడు(శుక్రవారం) విడుదలైంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సైతం ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రం ఓ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

శత్రు సేనలు అజయ్ దేవగన్‌ను చుట్టుముట్టి గన్స్ ఎయిమ్ చేయడంతో.. ఆయన తను చుట్టుకున్న ధోవతిని తీసేసి కాల్పండి అన్నట్టుగా ఈ మోషన్ పోస్టర్‌ను చూపించారు. ఈ మోషన్ పోస్టర్ ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన అప్‌డేట్స్ అన్నింటికీ చాలా భిన్నంగా అనిపించింది. ఓ రేంజ్‌లో ఉంది. ఈ మోషన్ పోస్టర్‌లో అజయ్ దేవగన్ తలకు గాయమైనట్టుగా చూపించారు. మొత్తానికి ఈ మోషన్ పోస్టర్.. టాలీవుడ్‌లో అయితే నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌ను చూడగానే అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఒక మోషన్ పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని చర్చ నడుస్తోంది.

ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగానూ.. తారక్ కొమురం భీమ్‌గానూ అలరించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి గురువు పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి వరుస అప్‌డేట్స్‌తో ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సినిమాను అద్భుతంగా రిలీజ్ చేయడమే కాకుండా.. అంతే అద్భుతంగా ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలిసిన జక్కన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీ నటుల బర్త్ డేలను టార్గెట్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos