'ఆర్‌ఆర్‌ఆర్‌' సరైప్రైజ్‌ అదేనా?

శనివారం దీపావళి.. పండుగరోజు అన్నీ ప్రొడక్షన్స్‌ హౌస్‌లు, దర్శక నిర్మాతలు, హీరోలు తమ సినిమాలకు సంబంధించిన లుక్స్‌ను విడుద చేస్తుంటారు. ఈ తరుణంలో కొందరు మాత్రం తమ అభిమాన స్టార్స్‌ నటించే సినిమాలకు సంబంధించి ఏమైనా స్పెషల్స్‌ ఉంటాయేమోనని ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అలా అందరూ ఆతృతగా ఎదురుచూసే సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన టీజర్స్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ తరుణంలో దీపావళికి సందర్భంగా జక్కన్న ప్రేక్షకాభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ చేస్తారట. రాజమౌళి స్వయంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లను ఇంటర్వ్యూ చేసినట్లుగా ఉంది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి ఇంటర్వ్యూ ఉంటుందా? లేక ఎన్టీఆర్‌, చరణ్‌, జక్కన్న కేవలం ఫొటోలకే పరిమితం అవుతారా అని తెలియాలంటే రేపు వరకు ఆగాల్సిందే.

కోవిడ్‌ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా రీసెంట్‌గా రీస్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా మేజర్‌ పార్ట్‌ చిత్రీకరణను పూరిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. సినిమాలో ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ స్టార్‌ ఓలివియా మోరిస్‌ ఇతర తారలు కొందరు తదుపరి షెడూల్‌లో జాయిన్‌ అవుతున్నారు.రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.

More News

నువ్వు నా బలం, సంతోషం: రాజీవ్‌కు సుమ శుభాకాంక్షలు

యాంకర్ సుమ కనకాల తన భర్త రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తన భర్తే తన బలం, సంతోషమని సుమ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం పోటీ పడుతున్న ఆశావహులు..

తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు.

నాని 28వ సినిమా... వెలువడిన ప్రకటన

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాని తన 26వ చిత్రం 'టక్‌ జగదీష్‌' సెట్స్‌పైనే ఉంది.

తెలంగాణలో క్రాకర్స్ బ్యాన్‌పై సుప్రీంలో లంచ్ మోషన్ పిటిషన్..

క్రాకర్స్ బ్యాన్‌పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

లేటెస్ట్‌ మూవీ లుక్‌ విడుదల చేసిన విజయ్‌ ఆంటోని

'నకిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని.