టెస్ట్ షూట్‌కి సిద్ధ‌మ‌వుతోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ యూనిట్‌

క‌రోనా ప్ర‌భావం నుండి సామాన్య జీవితాన్ని ప్రారంభించడానికి అంద‌రూ ప్రయ‌త్నాలు ప్రారంభిస్తున్నారు.. అయితే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని. క‌రోనా ప్ర‌భావంతో బెంబేలు ప‌డుతున్న రంగాల్లో సినీ రంగం ఒక‌టి. ఎందుకంటే ఎక్కువ మంది క‌లిసి ప‌నిచేయాల్సిన రంగం కావ‌డ‌మే అందుకు కార‌ణం. షూటింగ్స్ చేయాలంటే ఎక్కువ మంది యూనిట్ స‌భ్యులుంటే స‌న్నివేశాల‌ను ఎలా చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. దీనిపై చిరంజీవి,నాగార్జున స‌హా ఇండ‌స్ట్రీ పెద్ద‌లంద‌రూ క‌లిసి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

అస‌లు షూటింగ్స్ ఎలా జ‌రుపుతార‌నే దానిపై ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని త‌ల‌సాని ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు సూచించార‌ట‌. దీంతో రాజ‌మౌళి ముందుకు వ‌చ్చార‌ట‌. సినిమాలో అన్నీ స‌న్నివేశాలు భారీగానే చిత్రీక‌రించలేం. కొన్నింటిని త‌క్కువ మంది యూనిట్ స‌భ్యుల‌తో చిత్రీక‌రించ‌వ‌చ్చు. అస‌లు ఎలాచేయాల‌నే దానిపై త‌న ఆర్ఆర్ఆర్ టీమ్‌తో క‌లిసి ఓ టెస్ట్ షూట్ చేస్తాన‌ని రాజ‌మౌళి తెలిపార‌ట‌. అలాగే డిసెంబ‌ర్ వ‌ర‌కు చిన్న స‌న్నివేశాలను ముందుగా చిత్రీక‌రించి ఎక్కువ మంది టీమ్‌తో క‌లిసి చేయాల్సిన స‌న్నివేశాల‌ను డిసెంబ‌ర్ తర్వాత ప్లాన్ చేసుకుంటార‌ని టాక్‌.

More News

నేను మాస్క్ ధరించా.. మరి మీరు..? : మహేశ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం..

నిశ్చితార్థంపై రానా-నాని మధ్య చాటింగ్.. క్లారిటీ

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.

ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ పదే పదే పిలిచే రాహుల్ ఈయనే..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే చాలు ఎక్కువగా వినపడే పేరు రాహుల్.. రాహుల్..? ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ రాహుల్ క్వశ్చన్ వేయకుండా ఉండరు..?

ఆర్బీఐ ప్రకటనతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంకుల నుంచి లోన్లు

మరో 3 నెలలు ఈఎంఐ లోన్లు కట్టక్కర్లేదు.. ఆర్బీఐ కీలక ప్రకటన

కరోనా కష్టకాలంలో ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.