కర్ణాటక సీఎంకు రూ. 25 వేల జరిమానా..

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ డి.కున్హా రూ.25 వేల జరిమానా విధించారు. ఓ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఉండేందుకు గాను.. యడియూరప్ప అర్జీ వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను ఆదేశించడంతో పాటు యడియూరప్పకు రూ.25 వేల జరిమానా విధించింది. అసలు విషయంలోకి వెళితే...

కబెంగళూరు సమీపంలోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీనోటిఫికేషన్ ద్వారా యడియూరప్ప లబ్ధి పొందారన్న ఆరోపణలపై 2015లో కేసు నమోదైంది. కలబురగి హైకోర్టు సంచార బెంచ్‌లో సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ ఫిర్యాదు చేశారు. తాజాగా, ఈ కేసు విచారణ సందర్భంగా.. దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అలాగే ముఖ్యమంత్రి యడియూరప్పపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టు గతంలోనే నిరాకరించింది.

దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసిన యడియూరప్పకు న్యాయమూర్తి జస్టిస్ మేకేల్ డి కున్హా రూ. 25 వేల జరిమానా విధించారు. కాగా.. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై కలబురగి హైకోర్టు సంచార పీఠంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. డీ నోటిఫికేషన్ ద్వారా కుమారస్వామి బంధువులకూ లబ్ధి చేకూరించదని హీరేమఠ ఆరోపించారు.

More News

డేట్ ఫిక్స్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి...!

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఛాలెంజింగ్ రోల్‌లో హెబ్బా ప‌టేల్‌..!

‘కుమారి 21 ఎఫ్‌’ సూప‌ర్‌హిట్ కావ‌డంలో త‌న‌దైన పాత్ర‌ను పోషించిన హీరోయిన్ హెబ్బా ప‌టేల్‌..

బ‌న్నీ మూవీలో సాయిప‌ల్ల‌వి.. ఆ పాత్ర‌కు ఓకే చెబుతుందా?

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి.

‘ఆచార్య‌’ సినిమాకు స్ఫూర్తి అదేనా..?

డైరెక్ట‌ర్ కొర‌టాల శివ త‌న క‌థ‌ల‌ను నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రాసుకుంటాడ‌ని ఆయ‌న సినిమాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

దానికి స‌పోర్ట్‌గా న‌టి న్యూడ్ ఫొటోలు.. నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు

సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో ఎవరైనా న‌టి న్యూడ్ ఫొటోల‌ను షేర్ చేస్తే ఇదేంటి? ఇలా ఎందుకు చేస్తుంది?