రేపట్నుంచి తెలంగాణ ఆర్టీసీ రయ్.. రయ్..

తెలంగాణలో ప్రజా రవాణా నడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఇందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇవాళ సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన వివరాలు తెలిపారు. రేపట్నుంచి నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడుపుకోవచ్చని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రతిరోజూ శానిటైజ్ చేయడం.. అలాగే ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఆర్టీసీ నుంచి వస్తాయని కేసీఆర్ తెలిపారు.

ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్..

రేపు అనగా మంగళవారం ఉదయం 6గంటల తర్వాత నుంచే వాహనాల రాకపోకలు జరుగుతాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీలో ప్రాబ్లమ్ ఉంది గనుక సిటీ బస్సులు తిప్పడానికి వీల్లేదు. అదే విధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ అనగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు అనుమతించబడవు. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు నడవవు. రాష్ట్ర సరిహద్దుల లోపల మాత్రమే ఆర్టీసీ మొత్తం నడుస్తుంది.

సిటీలో ఇంకేం నడుస్తాయ్..

సిటీలో లోకల్ బస్సులు నడవడానికి వీల్లేదని చెప్పిన కేసీఆర్ కాస్త ఉపశమనం కలిగించే విషయమే చెప్పారు. అదేమిటంటే.. ఆటోలు, ట్యాక్సీలను అనమతి ఉంటుందని కాసింత నగరవాసులకు ఊరట కలిగించే విషయమే చెప్పారు.‘ ట్యాక్సీలో డ్రైవర్+03 అనగా నలుగురు మాత్రమే అనుమతి ఉంటుంది. కారులో కూడా డ్రైవర్+03కు పరిమితి ఉంటుంది. అలాగే ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఆటో, ట్యాక్సీ, కారు డ్రైవర్లు ఈ నిబంధనలు పాటించాల్సిందే. లేకుంటే పోలీసులు చాలెంజ్‌లు చేస్తారు’ అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.

ఛార్జీల సంగతేంటి..!?

అన్నీ సరే కానీ ట్యాక్సీ, కారు, ఆటో డ్రైవర్స్ ఛార్జీలు పెంచితే పరిస్థితేంటి..? అధికంగా వసూలు చేస్తే ఎలా అనేదానిపై మాత్రం కేసీఆర్ చెప్పలేదు. మరి ఇష్టానుసారం వీళ్లు వసూలు చేసేస్తే పరిస్థితి ఏంటి..? ఇదివరకటిలాగా ఛార్జీలు వసూలు చేసుకోవాల్సిందేనా..? లేకుంటే పెంపు అనేది వాళ్లకే ఛాయిస్ వదిలేశారా..? అనేది మాత్రమం తెలియరాలేదు. ఇప్పటికే రెండ్నెళ్ల పాటు వాహనాలు తిప్పక ఖాళీగా ఉన్న వీరు.. ఛార్జీలు పెంచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా చేస్తే నగరవాసి నుంచి దోపిడే అవుతుంది. మరి రేపో మాపో ఏమైనా రవాణా శాఖ నుంచి ఉత్తర్వులు వస్తాయేమో వేచి చూడాలి.

More News

తెలంగాణలో షాపులన్నీ తెరుచుకోవచ్చు.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో కూడా మే-31 వరకు లాక్ డౌన్ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇవాళ సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో మీడియాతో

నెల్లూరు ఘటనపై అందరూ గళం విప్పాలి : రష్మి

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదమైన విషయం విదితమే. జిల్లాలోని ఆత్మకూరు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ చేస్తున్న గదిలో చిన్నారి (06)తో గదిని తుడిపించారని ఆరోపణలు వచ్చాయి.

పూరి త‌న‌యుడిని ప‌ట్టించుకుంటారా!!

పూరి త‌న‌యుడు ఆకాశ్ పూరి బాల న‌టుడిగా పలు చిత్రాల్లో న‌టించాడు. త‌ర్వాత హీరోగా కూడా మెహ‌బూబా చిత్రంతో ప‌రిచ‌యం అయ్యాడు. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

ఇక‌పై న‌టించ‌ను: ఛార్మి

హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఛార్మి అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ న‌టించింది. అయితే క్ర‌మంగా నిర్మాత‌గా మారారు. పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ఈమె సినిమాలు నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

క్రేజీ కాంబినేష‌న్ మ‌రోసారి!!

మిర‌ప‌కాయ్‌తో సూప‌ర్‌డూప‌ర్ హిట్.. గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌తో రామ్ ఆచంట‌