ఏపీ ప్రజలకు షాక్.. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయ్!

  • IndiaGlitz, [Saturday,December 07 2019]

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో కూడా త్వరలోనే పెరుగుతాయని అప్పట్లో పుకార్లు వచ్చాయ్.. అయితే అనుకున్నట్లుగానే తెలంగాణ ఛార్జీలు పెంచి సరిగ్గా వారం కూడా కాకమునుపే ఏపీలో రవాణాశాఖ బాంబ్ పేల్చింది. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన రవాణాశాఖ మంత్రి పేర్ని నాని.. బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వార్త విన్న ఏపీ ప్రజలు ఛార్జీల పిడుగు పడిందంటూ చెప్పుకుంటున్నారు.

రేట్లు ఎలాగంటే..!

పల్లె వెలుగు, సిటీ సర్వీసులకు కి.మీ.కి 10 పైసలు పెంపు

మిగతా అన్ని సర్వీసులకు కి.మీ 20 పైసలు పెంపు

పెంచడానికి కారణాలేంటి!

‘ఆర్టీసీ నష్టాల్లో ఉంది.. అందుకే ఛార్జీలు పెంచుతున్నాం. ఇలాగే కొనసాగితే దివాళా తీయాల్సి ఉంటుంది. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాల్సి ఉంది. అందుకే ఆర్టీసీ ఛార్జీలు తప్పక పెంచాల్సి వస్తోంది. ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టం వస్తోంది. కొత్త రేట్లు ఎప్పట్నుంచి అమల్లోకి వస్తాయనే విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం’ అని మంత్రి నాని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.

తెలంగాణలో ఎంత పెరిగాయ్!?

పల్లె వెలుగు కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కు పెంపు

సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10గా నిర్దారించిన అధికారులు

ఎక్స్‌ప్రెస్‌ కనీస చార్జీ రూ.10 నుంచి రూ.15కి పెంపు

డీలక్స్‌ కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెంపు

సూపర్‌ లగ్జరీ కనీస చార్జీ రూ.25 కి పెంపు

రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస చార్జీ రూ.35

గరుడ ఏసీ లో కనీస చార్జీ రూ.35

గరుడ ప్లస్ ఏసీలో కనీస చార్జీ రూ.35

వెన్నెల ఏసీ స్లీపర్ లో కనీస చార్జీ రూ.70కు పెంచుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ మోత మోగుతోందన్న మాట.

More News

నేను పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు: నిత్యానంద

స్వయం ప్రకటిత దేవుడు, రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న స్వామి నిత్యానంద కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే.

'మిస్ మ్యాచ్’ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి  పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది - చిత్ర నిర్మాతలు శ్రీరామరాజు, భారత్ రామ్

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’  బేనర్ పై ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్  హీరో హీరోయిన్లుగా 'డాక్టర్ సలీమ్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో

రామ్ కృష్ణ తోట దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమా 'కోడి కత్తి'

రామ్ కృష్ణ తోట  దర్శకత్వంలో రూపొందిన  సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఎం3'. (మ్యాన్‌ మ్యాడ్‌ మనీ అనేది క్యాప్షన్‌).

ఆర్జీవీ 'అమ్మరాజ్యం..' రిలీజ్‌కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం రిలీజ్‌కు సెన్సార్ బోర్డు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

'మత్తు వదలరా' టీజర్‌ను విడుదల చేసిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్!

కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు.