ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా.. కేసీఆర్ శాశ్వతం కాదు!

  • IndiaGlitz, [Friday,October 18 2019]

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వినర్‌ అశ్వద్ధామరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ‘భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా..?. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు. కొందరు మంత్రులు ఆర్టీసీ కార్మికులపై విమర్శలు చేసి, ఆపై ఇంటికి వెళ్లి రోదిస్తున్నారు. కొందరు మంత్రుల తనతో టచ్‌లో ఉన్నారు.

ఆర్టీసీ సమ్మెపై మేధావులు మౌనం వీడాల్సిన సమయం వచ్చింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకుంటే మాత్రం 1994 సంక్షోభం పునరావృతమవుతుంది. కేసీఆర్ ఆ విషయాన్ని మర్చిపోకూడదు’ అని ఈ సందర్భంగా అశ్వద్ధామ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే.. అశ్వద్ధామకు టచ్‌లో ఉండే మంత్రులు ఎవరు..? ఆయన వెనుక ఎవరున్నారు..? ఆయనతో ఎవరిలా మాట్లాడిస్తున్నారు..? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు.

More News

జగన్‌ పాలన చూసి ఓర్వలేక ఈ దుశ్చర్య!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ, ఆర్థికబలంతో నడిచే పత్రికలు,

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రెండు వారాలుగా సమ్మెకు దిగిన తెలిసిందే. తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందేనని కార్మికులు..

బుల్లితెర రంగంలో విషాదం.. ‘బుల్లి బాలయ్య’ కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు ప్రబలిన సంగతి తెలిసిందే. ఆర్ఎంపీ ఆస్పత్రి చూసినా.. ఎంబీబీఎస్ ఆస్పత్రి చూసిన జ్వరాలొచ్చిన జనాలతో కిటకిటలాడుతున్నాయి.

'విజిల్‌' అక్టోబ‌ర్ 25న రిలీజ్

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజ‌య్‌`.

'జార్జ్ రెడ్డి' నైజాం రైట్స్ సొంతం చేసుకున్న గ్లోబల్ సినిమాస్

ట్రైలర్ తో అంచనాలు పెంచిన జార్జిరెడ్డి సినిమాకు బిజినెస్ పరంగా మంచి ఆఫర్లు వస్తున్నాయి..ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ను ఇటీవలే అభిషేక్ పిక్చర్స్