ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. సమ్మెకు ముగింపు

  • IndiaGlitz, [Wednesday,November 20 2019]

తెలంగాణలో ఒకట్రెండోజులు కాదు ఏకంగా 48 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఈ ప్రకటనను కన్వీనర్‌తో పాటు మరో ముగ్గురు కో కన్వీనర్‌లు కలిసి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుని ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి చూస్తే ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో బస్సులు యథేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడిందన్న మాట. కార్మికులు విధుల్లో చేరడానికి.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూల వాతావరణ కల్పించాలని జేఏసీ కన్వీనర్ కోరారు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని.. బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు.

ప్రభుత్వం ఆర్టీసీని ఒక ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని తెలిపింది. కార్మికుల సమ్మె ఉద్దేశం సమస్యలు పరిష్కారానికే తప్ప విధులను విడిచిపెట్టడం కాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అశ్వత్థామ ఉదహరించి చెప్పారు. జేఏసీ నాయకులు, విపక్ష నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం సాయంత్రం ఈ ప్రకటనను విడుదల చేశారు.

More News

'భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు' ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా

RRR నెగిటివ్ షేడ్స్‌లో నటించేది ఈ ఇద్దరే...

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR.

RRRలో ఎన్టీఆర్‌ సరసన నటించేది ఈ బ్యూటీనే..

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం RRR.

'త‌లైవి' లో యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్‌?

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `త‌లైవి`. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' గా ప్రభుదేవా!

పోకిరి చిత్రాన్ని హిందీలో 'వాంటెడ్' పేరుతో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కొట్టిన డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా