Rudrangi:'రుద్రంగి' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Monday,October 03 2022]

ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్ ని నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్శించింది.

అలా ఈ రోజు 'రుద్రంగి' ఫస్ట్ లుక్ ని టైటిల్ మోషన్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేయగా అందులో నటుడు జగపతి బాబుని భీకరంగా, జాలి-దయ లేని 'భీమ్ రావ్ దొర' గా పరిచయం చేసారు.

ఉత్కంఠ పెంచేలా ఉండే నేపథ్య సంగీతం తో తీసుకెళుతూ, రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ అని జగపతి బాబు డైలాగ్ తో ముగించేలోపు ప్రేక్షకుడి వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి.

కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో 'రుద్రంగి' చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరుల తో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు.

టైటిల్ కి ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పందన రావడంతో నిర్మాతలు చిత్రాన్ని థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

More News

Varsha Bollamma: స్వాతిముత్యం సహజంగా,చాలా బాగుంటుంది: వర్ష బొల్లమ్మ

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం'.

BiggBoss: ఆరోహి ఎలిమినేట్.... హౌస్‌లో స్వచ్ఛమైన మనిషులు వాళ్లేనంటూ కామెంట్స్

అనుకున్నదే అయ్యింది బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఆరోహి ఎలిమినేట్ అయ్యింది. కెమెరా స్పేస్‌కి అస్సులు ప్రయత్నించకపోవడం,

Praveen Sattaru: 'ది ఘోస్ట్ ' క్లాస్ గా తీసిన పక్కా మాస్ సినిమా..చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి:  ప్రవీణ్ సత్తారు

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'.  పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున.

'ఎ బ్యూటిఫుల్ గర్ల్' టీజర్ ను లాంచ్ చేసిన హీరో అడవి శేష్

బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై నిహాల్ కోదాటి,

Dasara: నాని 'దసరా' ఫస్ట్ సింగిల్ 'ధూమ్ ధామ్' సాంగ్

నేచురల్ స్టార్ నాని  మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దసరా' నుండి మాస్ , రగ్గడ్ డ్యాన్స్ మూవ్‌లతో కూడిన మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్