తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్‌

  • IndiaGlitz, [Wednesday,May 06 2020]

ఉత్త‌రాది భామ‌లు ద‌క్షిణాది సినిమాల్లో త‌మ హ‌వా చాటుతున్నారు. ఇప్పుడు ఉత్త‌రాది హీరోయిన్స్ కేవ‌లం అలా వ‌చ్చి సినిమాలు చేసి పోవ‌డ‌మే కాకుండా ఇక్క‌డి వారికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు నేర్చుకుంటున్నారు. స్వ‌యంగా తెలుగులో డ‌బ్బింగ్ చెబుతున్నారు కూడా. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో న‌టించే ఇత‌ర రాష్ట్రాల హీరోయిన్స్ తెలుగు నేర్చుకోవ‌డంపై ఆస‌క్తిని చూపుతున్నారు. త‌మ‌న్నా, అనుష్క‌, నిత్యామీన‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భానటేశ్‌, పూజా హెగ్డే ఇలా చాలా మంది హీరోయిన్స్ తెలుగు నేర్చుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు.

ఇప్పుడు వీరి లిస్టులోకి మ‌రో హీరోయిన్ చేరబోతుంది. ఆమె ఎవ‌రో కాదు.. రుహానీ శ‌ర్మ‌. తొలి చిత్రం రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సుశాంత్‌తో క‌లిసి నటించింది రుహానీ శ‌ర్మ‌. ఆ సినిమా స‌క్సె్ కావ‌డంతో అంద‌రి దృష్టిలో ప‌డింది. రెండో చిత్రం హిట్‌తో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన గ్యాప్‌ను వేస్ట్ చేసుకోకుండా తెలుగు నేర్చుకోవ‌డంపై దృష్టి పెట్టింద‌ట‌. రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో తెలుగు నేర్చుకుంటోంద‌ట‌. తెలుగును ఎలా ప‌ల‌కాల‌నే దానిపై ప్ర‌తిరోజూ గంట‌పాటు ఆన్‌లైన్ క్లాసుల‌ను వింటుంద‌ట‌. అంటే త్వ‌ర‌లోనే ఈ అమ్మ‌డు తెలుగులో డ‌బ్బింగ్ చెప్పుకుంటుంద‌న్న‌మాట‌.

More News

కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. ఏంటిది ఎందుకిలా చేస్తోందో..!?

కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే టికెట్లపై నగదు వసూలు చేయడం, కరెంట్ తమ ఆధీనంలోకి తీసుకుంటామనే విషయాలపై కేసీఆర్ ఒకింత సీరియస్ అయ్యారు.

15 తర్వాత తెలంగాణలో ఆర్టీసీ నడుస్తుంది : కేసీఆర్

తెలంగాణలో 15 తర్వాత ఆర్టీసీ నడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆటోలు, క్యాబ్‌లకు గ్రీన్ జోన్లలో మాత్రం పూర్తిగా అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణలో అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు : కేసీఆర్

తెలంగాణలోని మందుబాబులకు సీఎం కేసీఆర్ తియ్యటి శుభవార్త చెప్పారు. రేపట్నుంచే అనగా బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరుస్తున్నట్లు మీడియా

పదో తరగతి పరీక్షలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ..

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోనళపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

కరోనాతో కలిసి బతకాల్సిందే..: కేసీఆర్

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌తో మనం కలిసి బతకాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో