close
Choose your channels

సురేఖ వాణిపై రూమర్స్.. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్

Wednesday, August 4, 2021 • తెలుగు Comments

సురేఖ వాణిపై రూమర్స్.. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది సురేఖ వాణి. ఇదిలా ఉండగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

దీనితో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో కొందరు సెలెబ్రిటీల పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో సురేఖ వాణి పేరు కూడా ఉంది. సురేఖ వాణికి భారీ రెమ్యునరేషన్ తో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని కంటెస్టెంట్ గా ఎంపిక చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతుండడంతో ఆమె స్పందించారు.

సురేఖ వాణిపై రూమర్స్.. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్

ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో సురేఖ స్పందిస్తూ.. తానూ బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని.. వస్తున్న రూమర్స్ అన్ని అసత్యం అంటూ పోస్ట్ పెట్టింది. అది ఫేక్ న్యూస్.. నేను బిగ్ బాస్ 5 లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అని సురేఖ కామెంట్ పెట్టింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే డిలీట్ చేసేసింది. దీనితో ఆమె బిగ్ బాస్ లో పాల్గొంటుందా లేదా అనే కన్ఫ్యూషన్ నెలకొంది.

ఇక సురేఖతోపాటు బిగ్ బాస్ కు ఎంపికైనట్లు ప్రచారం జరుగుతున్న సెలెబ్రిటీలలో.. యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ పేర్లు వైరల్ అవుతున్నాయి.

సురేఖ వాణిపై రూమర్స్.. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే బిగ్ బాస్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా బిగ్ బాస్ 5 సాఫీగా జరగాలంటే కోవిడ్ కేసులు అదుపులో ఉండాలి. ఇటీవల మలయాళీ బిగ్ బాస్ షో అర్థాంతరంగా కోవిడ్ వల్ల మధ్యలో ఆగిపోయింది.

Get Breaking News Alerts From IndiaGlitz