రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : కాస్త శాంతించిన పుతిన్.. తాత్కాలికంగా కాల్పుల విరమణ

  • IndiaGlitz, [Saturday,March 05 2022]

ఉక్రెయిన్ స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఆయనను నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆంక్షలు విధిస్తున్నా.. స్విఫ్ట్ వంటి వేదికల నుంచి వెలివేస్తున్నా పుతిన్ ఆగడం లేదు. భీకరదాడులతో ఉక్రెయిన్ వాసులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యూరప్‌కు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో రష్యా స్వల్పంగా శాంతించింది. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటిస్తూ.. పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించింది.

ఉక్రెయిన్‌లోని మరియుపొల్, వోల్నవోఖ్‌ నగరాల్లో పౌరులను సురక్షితంగా తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల నుంచి తమ దళాలు కాల్పులను నిలిపేస్తాయని పేర్కొంది. కాగా.. వోల్నవోఖ్‌, మరియుపోల్‌ను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడించాయి. అయితే అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిడి కారణంగా రష్యా ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. భీకర యుద్ధం కారణంగా ఉక్రెయిన్ స్మశానాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా రక్తపు మడుగులు, కాలిపోయిన శవాలు, భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. షెల్స్, బాంబులతో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది యూరప్ దేశాలకు వలసవెళ్లగా.. ఇంకొందరు ఉక్రెనియన్లు దేశం కోసం ఆయుధాలు పట్టి పోరాడుతున్నారు. ఇకపోతే.. యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన జెపోరోజియాపై రష్యా దాడి చేసింది. ఈ దాడులతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

More News

క్రికెట్ ప్రపంచానికి షాక్.. ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్ కన్నుమూత

క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : భారతీయ విద్యార్ధిపై కాల్పులు , ఆసుపత్రికి తరలింపు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇరుదేశాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ పుతిన్ కానీ, జెలెన్ స్కీ కానీ తగ్గడం లేదు.

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. ఒక ప్రమాదాలకు నో ఛాన్స్ ‘‘క‌వ‌చ్’’ వచ్చేసిందిగా

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నా దేశంలో నిత్యం ఏదో ఒక మూల రైలు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి.

ప్రాజెక్ట్ కే : మీ సాయం కావాలి.. ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్‌లో బిజీగా వున్నారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘‘హను మాన్’’ నుంచి వరలక్ష్మీ ఫస్ట్‌లుక్.. మరోసారి జయమ్మ ఉగ్రరూపం

తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు.