సెప్టెంబర్ 14కి రష్యా మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్..

  • IndiaGlitz, [Monday,September 14 2020]

ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన దేశం రష్యా. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను తన కూతురిపైనే నిర్వహించి సెన్సేషన్ సృష్టించారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను రష్యా నలుమూలలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురషుకో మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14వ తేదీ నాటికి రష్యాలోని అన్ని ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సిన్ చేరుకుంటుందని తెలిపారు. ఇప్పటికే పరీక్షల నిమిత్తం తొలిదశ వ్యాక్సిన్‌ను పంపిచినట్టు తెలిపారు. ఈ తొలి బ్యాచ్‌లో రేపటికి గమ్య స్థానాలకు చేరుకుంటాయన్నారు.

మూడో దశ ప్రయోగాల కింద రష్యాలో 40 వేల మందికి వ్యాక్సినేషన్‌ను ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన అనుమతులను ఇప్పటికే రష్యా ఆరోగ్యశాఖ ఇచ్చేసింది. 2020-21 సంవత్సరానికి దాదాపు 100 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించాలని రష్యన్ డైరెక్టరేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) భావిస్తోంది. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి దేశంగా రష్యా చరిత్రలో నిలిచిపోనుంది.

More News

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆ ఇద్దరి అరెస్ట్

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక వ్యక్తులిద్దరూ అరెస్ట్ అయ్యారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ప్రముఖంగా దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు అశోక్‌రెడ్డి పేర్లు వినిపించాయి.

యుక్త వ‌య‌సులో ప‌న‌వ్ ఫొటోను షేర్ చేసిన నాగ‌బాబు

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్నాడు.

లొకేష‌న్స్ వేట‌లో బ‌న్నీ.. కొత్త స‌మ‌స్య‌!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న పుష్ప సినిమా కోసం లొకేష‌న్ వేట‌లో ప‌డ్డాడు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు మ‌హారాష్ట్ర ప్రాంతాల‌ను సంద‌ర్శించారు.

ఆమ్రపాలికి అరుదైన అవకాశం.. పీఎంవోలో నియామకం..

యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలికి అరుదైన అవకాశం దక్కింది. కేబినెట్ సెక్రటేరియల్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ఆమ్రపాలి..

కరోనాని మించిన మహమ్మారి ముందుంది...

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. సామాన్య ప్రజలు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుక్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.