కాబోయే భార్య‌ని ప‌రిచ‌యం చేసిన కార్తికేయ‌.. స్టేజ్‌పైనే మోకాళ్లపై కూర్చొని ప్ర‌పోజ్

  • IndiaGlitz, [Sunday,November 07 2021]

ప్రస్తుతం తెలుగు నాట హీరోలు, హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలెక్కుతున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ‌. హిట్స్, ఫ్లాప్స్‌‌తో సంబంధం లేకుండా వ‌రుస పెట్టి ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా కార్తికేయ న‌టిస్తున్న చిత్రం ‘‘ రాజా విక్ర‌మార్క‌ ’’. ఈ సినిమాను నవంబర్‌ 12న విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌ర‌గగా, ఈ వేడుక‌లో త‌న‌కు కాబోయే భార్య‌ని ప‌రిచ‌యం చేశాడు . నవంబ‌ర్ 21న త‌న పెళ్లికి పెద్దలు నిశ్చయించారని.. దీనిలో భాగంగానే త‌నకి కాబోయే భార్య‌ని వేదిక‌ పైకి పిలిచి పరిచ‌యం చేశాడు. అంతేకాదు అంద‌రిముందూ ప్ర‌పోజ్ చేశాడు.

“‘నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా. అప్పుడే తనకి నేను హీరో అవుదామని అనుకుంటున్నానని చెప్పి, హీరో అయ్యాక మీ ఇంట్లో వచ్చి అడుగుతా’నని చెప్పా. నేను హీరో అయ్యి… చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా. ఈ నెల 21న నా పెళ్లి’ అని కార్తికేయ చెప్పుకొచ్చాడు. ఇటీవల నిశ్చితార్థం త‌ర్వాత కార్తికేయ త‌న ప్రేమ, పెళ్లి విష‌యం బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఆమె పేరు లోహిత (లోహిత రెడ్డి) అని, (నిట్) వరంగల్‌లో పరిచయమైందని, మొదటి సారి ఆమెను చూసిన క్షణం నుంచి ఇప్పటికీ, ఎప్పటికీ తమ బంధం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.

More News

పుష్ప ది రైజింగ్.. సునీల్ మరీ ఇంత క్రూరంగానా, భయపెడుతున్న మంగళం శ్రీను

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి పార్ట్‌ని ‘‘పుష్ప ది రైజింగ్ ’’

'భీమ్లా నాయ‌క్' నుంచి టైటిట్ సాంగ్ విడుద‌ల‌.. ఫ్యాన్స్‌ని ఊపేస్తున్న ‘లాలా భీమ్లా’

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

బిగ్‌బాస్ 5 తెలుగు : ముగ్గురు సేఫ్.. ఇంకా డేంజర్‌ జోన్‌లో ఐదుగురు, మరి ఎలిమినేషన్‌ ఎవరో..?

బిగ్‌బాస్ 5 తెలుగు శనివారం సరదాగా సాగింది. ఎప్పటిలాగే వీకెండ్ కావడంతో నాగ్ ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్ తప్పుల్ని ఎత్తిచూపుతూ వారికి క్లాస్ పీకారు.

పుట్టినరోజు వేళ అభిమానులకు అనుష్క సర్‌ప్రైజ్.. 48వ సినిమాకు గ్రీన్‌సిగ్నల్

అనుష్క శెట్టి .. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

#MEGA154: ఊర నాటు లుక్‌లో మాస్ మూల విరాట్ .. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో జోరు మీదున్నారు. 70కి చేరువవుతున్నా కుర్రాళ్ల కంటే స్పీడుగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ను రెడీ